Swetha
మంచు విష్ణుదే కాదు టోటల్ మంచు ఫ్యామిలీ డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండడంతో రిలీజ్ కు ముందు వరకు కూడా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి
మంచు విష్ణుదే కాదు టోటల్ మంచు ఫ్యామిలీ డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండడంతో రిలీజ్ కు ముందు వరకు కూడా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి
Swetha
మంచు విష్ణుదే కాదు టోటల్ మంచు ఫ్యామిలీ డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండడంతో రిలీజ్ కు ముందు వరకు కూడా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా విష్ణు సినిమాను ఏ రేంజ్ లో ప్రమోట్ చేయాలో ఆ రేంజ్ లో ప్రమోట్ చేసాడు. లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా తొలి వీకెండ్ వరకు మంచి టాక్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.
అయితే ఇప్పుడు చాలా వరకు సినిమాలు రిలీజ్ కు ముందే డిజిటల్ , శాటిలైట్ హక్కులను అమ్మేస్తుంటే.. మంచు విష్ణు మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. దాని ఫలితమే మిగిలిన అన్ని సినిమాలలా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులకే ఓటిటి లోకి రాలేదు. సినిమా రిలీజ్ అయినా మూడు నెలలకు ఓటిటి డీల్ ఫిక్స్ అవ్వడం , డేట్ లాక్ అవ్వడం జరిగింది. అయితే సినిమా హక్కులను ఎంత మొత్తానికి అమ్మారు అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ సినిమా హక్కులను మాత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట.
థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు. ఓటిటి కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నా.. సినిమాలో ప్రభాస్ లాంటి భారీ క్యాస్టింగ్ ఉండడంతో ఓటిటి స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లో ఫెయిల్ అయిన సినిమాలు ఓటిటి లో మంచి టాక్ తెచ్చుకుంటున్న ట్రెండ్ లో కన్నప్ప ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి.మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.