iDreamPost
android-app
ios-app

భక్త కన్నప్ప షూటింగ్ లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు!

  • Author Soma Sekhar Published - 04:05 PM, Sun - 29 October 23

భక్త కన్నప్ప మూవీ షూటింగ్ లో మంచు విష్ణుకు గాయాలు అయినట్లు సమాచారం. అతడికి గాయాలు కావడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు.

భక్త కన్నప్ప మూవీ షూటింగ్ లో మంచు విష్ణుకు గాయాలు అయినట్లు సమాచారం. అతడికి గాయాలు కావడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు.

  • Author Soma Sekhar Published - 04:05 PM, Sun - 29 October 23
భక్త కన్నప్ప షూటింగ్ లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు!

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మహాశివుడి పరమ భక్తుడి పాత్రలో విష్ణు నటిస్తున్నాడు. ఇక ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్, మహాభారతం టీవీ సిరీస్ ఫేమ్ ముకేశ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. అన్ని ఏర్పాట్లతో మూవీ యూనిట్ మెుత్తం అక్కడి చేరుకుని శరవేగంగా చిత్రీకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. కన్నప్ప మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో మంచు విష్ణుకు గాయాలు అయినట్లు సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో విష్ణు గాయపడ్డట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భక్త కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం. ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతుండగా.. ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా మంచు విష్ణుకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఓ డ్రోన్ ఉన్నట్లుండి విష్ణు మీద కుప్పకూలింది. దీంతో అతడి చేతికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించినట్లుగా అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. విష్ణుకు గాయాలు కావడంతో.. తాత్కాలికంగా షూటింగ్ నిలిచిపోయింది.

అయితే ఈ విషయమై అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ విషయం తెలిసిన అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో కన్నప్ప తెరకెక్కుతోంది. ఈ మూవీలో భారీ స్టార్ క్యాస్టింగ్ ని దించబోతున్నారు విష్ణు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్, నయనతారలు శివపార్వతులుగా నటిస్తున్నారన్న వార్తలు వైరల్ గా మారగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ మూవీలోకి చేరాడు. దీంతో కన్నప్ప స్టార్టింగ్ నుంచే భారీ హైప్ ను క్రియేట్ చేస్తూ ముందుకెళ్తోంది. న్యూజిలాండ్ లోనే సింగిల్ షెడ్యూల్ లో మూవీ మెుత్తం షూటింగ్ పూర్తి చేయాలని భావించిన విష్ణుకు.. గాయాలు కావడం విచారకరం.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/