iDreamPost
android-app
ios-app

కన్నప్ప కోసం భారీ ప్లాన్‌.. న్యూజిలాండ్‌కు 8 కంటైనర్లు పంపిన మంచు విష్ణు!

  • Published Sep 23, 2023 | 5:37 PM Updated Updated Sep 23, 2023 | 5:37 PM
  • Published Sep 23, 2023 | 5:37 PMUpdated Sep 23, 2023 | 5:37 PM
కన్నప్ప కోసం భారీ ప్లాన్‌.. న్యూజిలాండ్‌కు 8 కంటైనర్లు పంపిన మంచు విష్ణు!

ప్రముఖ హీరో మంచు విష్ణు ‘కన్నప్ప’ అనే సినిమాను తీయబోతున్న సంగతి తెలిసిందే. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఈ సినిమాను స్వయంగా మంచు విష్ణునే తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. విష్ణు ప్రధాన పాత్ర చేస్తుండగా.. హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నారు. మహాభారతం దర్శకుల్లో ఒకరైన ముకేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. చిత్ర షూటింగ్‌ మొత్తం న్యూజిలాండ్‌లో జరగనుందని సమాచారం. ఇందుకోసం ఇక్కడినుంచే అవసరమైన వస్తువుల్ని అక్కడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సెట్లు వేయటానికి అవసరమైన సామాగ్రిని దాదాపు ఎనిమిది కంటైనర్ల ద్వారా తరలించినట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు 800 మంది 5 నెలలుగా కష్టపడ్డారట. సదరు కంటైనర్లు సముద్ర మార్గం ద్వారా న్యూజిలాండ్‌ చేరుకోనున్నాయి.

మరి కొద్దిరోజుల్లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌, నయన తార కూడా గెస్ట్‌ రోల్స్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జంటగా కృతి సనన్‌ చెల్లలు నుపుర్‌ సనన్‌ నటించాల్సి ఉండింది. అయితే, ఆమె  ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం హీరోయిన్‌ వేటలో పడింది. ఇక, ఈ సినిమా దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరి, మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş