iDreamPost
android-app
ios-app

Manchu Manoj: మంచు మనోజ్ వార్నింగ్‌.. ‘హనుమంతు.. అమ్మతోడు.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు’

  • Published Jul 08, 2024 | 9:10 AM Updated Updated Jul 08, 2024 | 11:46 AM

Father Daughter Video: మంచు మనోజ్‌.. హనుమంతు అనే వ్యక్తికి సోషల్‌ మీడియా వేదికగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే..

Father Daughter Video: మంచు మనోజ్‌.. హనుమంతు అనే వ్యక్తికి సోషల్‌ మీడియా వేదికగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే..

  • Published Jul 08, 2024 | 9:10 AMUpdated Jul 08, 2024 | 11:46 AM
Manchu Manoj: మంచు మనోజ్ వార్నింగ్‌.. ‘హనుమంతు.. అమ్మతోడు.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు’

గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో వికృత చేష్టాలు ఏ స్థాయికి దిగజారాయో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే వీడియో ఇది. దీనిలో కొందరు తెలుగు యూట్యూబర్స్‌.. ఓ చిన్న పాప, తండ్రి మధ్య జరిగిన సంఘటన గురించి అత్యంత దారుణంగా.. నీచమైన కామెంట్స్‌ చేస్తూ.. తమలోని రాక్షసత్వాన్ని నిర్భయంగా.. ఏమాత్రం సిగ్గు లేకుండా బరితెగించి ప్రదర్శించారు. డార్క్‌ కామెడీ పేరుతో.. ఆత్మీయ బంధాన్ని సైతం అపహాస్యం చేస్తూ.. రాక్షసానందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ కావడంతో.. చాలా మంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాక సెలబ్రిటీలు సైతం.. ఈ వీడియోపై స్పందిస్తూ.. సదరు యూట్యూబర్ల మీద మండిపడుతున్నారు. ఇలాంటి వారిని వదిలి పెట్టవద్దని.. రెండు రాష్ట్రాల సీఎంలు, అధికారులను కోరుతున్నారు.

ఈ ఘటనపై మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ స్పందిస్తూ.. పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. సోషల్ మీడియా క్రూరంగా, అసహ్యంగా, భయానకంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని మానవ మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదని.. చిన్న పిల్లల భద్రతపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. ఇక ఈ వీడియోపై తాజాగా మంచు మనోజ్‌ కూడా స్పందించారు. అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను హనుమంతు అంటూ మనోజ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై మంచు మనోజ్‌ స్పందిస్తూ.. ‘‘చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సమాజంలో కొన్ని మానవ మృగాలు సంచరిస్తున్నాయి. ఆ జాతికి చెందిన కొందరు ఇదుగో ఇలా పిల్లల విషయంలో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తూ.. నీచమైన వీడియోలు చేస్తున​ఆనరు. ఇది అత్యంత దారుణం. ఫన్, వినోదం ముసుగులో జరుగుతున్న ఇలాంటి దారుణాలు సమాజానికి చాలా ప్రమాదకరం. సుమారు ఏడాది క్రితం ఏపీ, తెలంగాణలో చిన్న పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా హనుమంతు అనే వ్యక్తిని సంప్రదించాను. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ రోజు చూస్తే అతడే పసిపిల్లలపై నీచమైన కామెంట్స్ చేసే స్థాయికి దిగ జారాడు’’ అని చెప్పుకొచ్చాడు మనోజ్‌.

అంతేకాక ‘‘మన పిల్లలు, ఆడవారి రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దయచేసి ఇలాంటి వారిని అసలు వదిలిపెట్టవద్దని రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఈ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పి హనుమంతు.. అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను’’ అంటూ ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చాలా మంది మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişRekabet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel