iDreamPost
android-app
ios-app

అంబానీ ఈవెంట్ లో మనోజ్ దంపతుల సందడి.. మనోజ్ రేంజ్ మామూలుగా లేదు!

  • Author Soma Sekhar Published - 03:10 PM, Thu - 2 November 23

ముంబైలో జరిగిన ముకేశ్ అంబానీ ఈవెంట్ లో తన భార్యతో కలిసి సందడి చేశాడు మనోజ్. ఇది చూసిన నెటిజన్లు మనోజ్ రేంజ్ మామూలుగా లేదుగా అంటూ కితాబిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అది తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.

ముంబైలో జరిగిన ముకేశ్ అంబానీ ఈవెంట్ లో తన భార్యతో కలిసి సందడి చేశాడు మనోజ్. ఇది చూసిన నెటిజన్లు మనోజ్ రేంజ్ మామూలుగా లేదుగా అంటూ కితాబిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అది తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.

  • Author Soma Sekhar Published - 03:10 PM, Thu - 2 November 23
అంబానీ ఈవెంట్ లో మనోజ్ దంపతుల సందడి.. మనోజ్ రేంజ్ మామూలుగా లేదు!

మంచు మనోజ్.. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు ప్రేక్షకులు దాదాపుగా మరచిపోయిన పేరు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కూడా ఇదే. ఇక మనోజ్ పెళ్లి తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ వస్తున్నాడు. షోలల్లో పాల్గొనడం, ఈవెంట్స్ కు తన భార్య భూమా మౌనికా రెడ్డితో కలిసి హాజరవ్వడం చేస్తున్నాడు. అదీకాక ఆ మధ్యన ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షో చేయబోతున్నట్లుగా తెలిపారు. దీంతో అందరి చూపు మనోజ్ పై పడింది. తాజాగా మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు మనోజ్. ముంబైలో జరిగిన ముకేశ్ అంబానీ ఈవెంట్ లో తన భార్యతో కలిసి సందడి చేశాడు మనోజ్. ఇది చూసిన నెటిజన్లు మనోజ్ రేంజ్ మామూలుగా లేదుగా అంటూ కితాబిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అది తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.

మంచు మనోజ్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన పర్సన్. దానికి కారణం అతడు తాజాగా హాజరైన ఓ ఈవెంటే. తాజాగా మంచు మనోజ్-మౌనికా రెడ్డి దంపతులు ముంబైలో సందడి చేశారు. రిలయన్స్, జియో అధినేత ముకేశ్ అంబానీకి సంబంధించిన ఓ ఈవెంట్ లో వీరిద్దరు పాల్గొన్నారు. ముంబైలో అత్యంత లగ్జరీ మాల్ ‘జియో వరల్డ్ ప్లాజా’ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎందరో సెలబ్రిటీలు వచ్చారు. కానీ తెలుగు నుంచి ఆహ్వానం అందిన ఏకైక హీరో మాత్రం మంచు మనోజ్ ఒక్కడే కావడం విశేషం.

ఇక ఈ ఈవెంట్ కు స్టార్ హీరోయిన్లు అయిన శృతిహాసన్, రష్మిక, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు వచ్చారు. అంబానీ మనోజ్ దంపతులతో కొద్ది సేపు ముచ్చటించడం విశేషం. మనోజ్ దంపతులిద్దరు బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మనోజ్ రేంజ్ ఇదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మనోజ్ భయ్య రేంజ్ మామూలుగా లేదుగా.. ఇన్ని రోజులు మేం ఏదో అనుకున్నాం భయ్యో అంటూ సరదాగా సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు నెటిజన్లు. మరి అంబానీ ఈవెంట్ లో మెరిసిన మనోజ్ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి