iDreamPost
android-app
ios-app

ఆదిపురుష్‌ విడుదల.. మంచు మనోజ్‌పై ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజనులు!

  • Published Jun 17, 2023 | 11:50 AM Updated Updated Jun 17, 2023 | 11:50 AM
  • Published Jun 17, 2023 | 11:50 AMUpdated Jun 17, 2023 | 11:50 AM
ఆదిపురుష్‌ విడుదల.. మంచు మనోజ్‌పై ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజనులు!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ఆదిపురుష్‌ చిత్రం జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందకు వచ్చింది. ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించనుండటంతో.. ప్రారంభం నుంచే ఈ సినిమా మీద భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. సుమారు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో.. కృతి సనన్‌ సీత పాత్రలో నటించగా.. సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్రలో నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజే సుమారు 100 కోట్ల రూపాయల మేర వసూలు చేసిందని టాక్‌. ఇక ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్స్‌లో ఆదిపురుష్‌ చిత్రం రిలీజ్ అయ్యింది. ఇక సినిమాలో రామరావణుల యుద్ధాన్ని కళ్ళకు కట్టేలా చూపించారంటూ దర్శకుడు ఓంరౌత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. కాకపోతే సినిమా వీఎఫ్ ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆదిపురుష్‌ సినిమాపై బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా పలువురు తారలు సినిమా టికెట్లను ఉచితంగా పంచుతూ.. మంచి మనసు చాటుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మంచు మనోజ్‌పై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్న.. మీరు రియల్‌ హీరో అంటూ ఆకానికెత్తుతున్నారు. ఇంతకు మనోజ్‌ను ఎందుకు ఇంతలా మెచ్చుకుంటున్నారు అంటే.. సుమారు 2500 మంది అనాథ పిల్లలకు ఉచితంగా ఆదిపురుష్‌ టికెట్లు అందించి మంచి మనసు చాటుకున్నారు మంచు మనోజ్-మౌనిక దంపతులు. అంతేకాక ఆ పిల్లలతో కలిసి ఆదిపురుష్‌ సినిమా చూశారు మనోజ్‌ దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తల్లిదండ్రులు లేని చిన్నారుల పట్ల మంచు మనోజ్‌ ప్రవర్తించిన తీరు నిజంగా ఎందరికో స్ఫూర్తి దాయకం అంటున్నారు నెటిజనులు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల టికెట్స్, అభిషేక్ అగర్వాల్ 10వేల టికెట్స్, టీ సిరీస్ ఏకంగా 12 వేల టికెట్స్ కొనుగోలు చేసింది. ఇక సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్‌లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయిస్తోన్న సంగతి తెలిసిందే.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişAsyabahis girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel