iDreamPost
android-app
ios-app

మంచు మనోజ్‌ చేసిన వ్యాఖ్యలు మంచు విష్ణు గురించేనా?

మంచు మనోజ్‌ తాజాగా ‘సోదరా!’ సినిమా సాంగ్‌ లాంచ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదమ్ముల అనుబంధంపై వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ...

మంచు మనోజ్‌ తాజాగా ‘సోదరా!’ సినిమా సాంగ్‌ లాంచ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదమ్ముల అనుబంధంపై వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ...

మంచు మనోజ్‌ చేసిన వ్యాఖ్యలు మంచు విష్ణు గురించేనా?

మంచు అన్నదమ్ములు విష్ణు, మనోజ్‌ల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరిద్దరూ గొడవ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మనోజ్‌ ముఖ్య అనుచరుడైన సారథిపై మంచు విష్ణు దాడి చేశారు. ఈ దాడిలో సారథికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను మనోజ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో కాస్తా పెను చర్చకు దారి తీసింది. ఆ వీడియోపై నేరుగా మోహన్‌ బాబు స్పందించారు.

వెంటనే వీడియో డిలీట్‌ చేయాలని ఆదేశించారు. దీంతో ఆయన వీడియో డిలీట్‌ చేశారు. కొద్దిరోజుల తర్వాత జరిగిన మనోజ్‌ పెళ్లి కోసం మంచు లక్ష్మి మాత్రమే కష్టపడ్డట్టు తెలుస్తోంది. ఆమే దగ్గరుండి పెళ్లి పనులు చూసుకున్నారట. ఇక, అప్పటినుంచి మనోజ్‌, విష్ణులు వేరు వేరుగా ఉంటూ వస్తున్నారని, వేరు వేరు ఇళ్లలో ఉంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్‌ అన్నదమ్ముల అనుబంధంపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సంపూర్ణేష్‌ బాబు ప్రస్తుతం సోదరా అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా సాంగ్‌ రిలీజ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదమ్ముల అనుబంధంపై మాట్లాడుతూ..  ‘‘ అన్నదమ్ముల అనుబంధం అనేది చాలా ముఖ్యమైన బంధం. ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య ఈగోలు.. అనుచితమైనవి వస్తాయో.. అవి ఎప్పుడూ ముందుకు వెళ్లవు. అన్నదమ్ముల మధ్య ఈగోలు ఉండకూడదు. డబ్బు సమస్యలు ఉండకూడదు. ప్రాబ్లమ్స్‌ ఏవైనా వస్తున్నాయి అంటే.. వాళ్లిద్దరూ కూర్చుని మాట్లాడుకుని ఉండరు. ఎప్పుడు ఏదైనా ఒకరు కూర్చుని మాట్లాడుకుని.. బ్రదర్స్‌లో.. సిస్టర్స్‌లో.. ఫ్యామిలీ మెంబర్స్‌లో చల్లగా ఉంటుంది.

బ్రదర్స్‌ మీద.. హ్యూమన్‌ ఎమోషన్స్‌ మీద సినిమా తీయటం చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు మంచు విష్ణు ఉద్ధేశించే మనోజ్‌ అన్నట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. త్వరలో వీరిద్దరూ కలిసిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, మంచు విష్ణు ప్రస్తుతం ‘భక్త కన్నప్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సొంత బ్యానర్‌లో దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొన్న విష్ణు బర్త్‌డే రోజున విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరి, మంచు మనోజ్‌ అన్నదమ్మల అనుబంధంపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler