iDreamPost
android-app
ios-app

ఇంట్రెస్టింగ్‌ వీడియో షేర్‌ చేసిన మనోజ్‌.. ‘‘అన్ని మౌనంగా భరించాను.. తిరిగొస్తున్నాను’’

  • Published Sep 23, 2023 | 8:52 AM Updated Updated Sep 23, 2023 | 8:52 AM
  • Published Sep 23, 2023 | 8:52 AMUpdated Sep 23, 2023 | 8:52 AM
ఇంట్రెస్టింగ్‌ వీడియో షేర్‌ చేసిన మనోజ్‌.. ‘‘అన్ని మౌనంగా భరించాను.. తిరిగొస్తున్నాను’’

మంచు మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్‌. ఒకానొక సమయంలో వరుస హిట్స్‌ అతని ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాత ఒక్కసారిగా మనోజ్‌ కెరీర్‌ గాడి తప్పింది. ఇదే సమయంలో వ్యక్తిగత విషయాల వల్ల కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. గతేడాది భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం సంతోషంగా సాగుతుంది. ఇప్పుడు కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టే పని ప్రారంభించాడు మనోజ్‌.

సుమారు 5 ఏళ్ల క్రితం అనగా 2018లో వెండితెరకు దూరమయ్యాడు మనోజ్‌. ఆ తర్వాత కొంత కాలానికి సొంతంగా ప్రొడక్షన్‌ సంస్థను ఏర్పాటు చేసి.. అహం బ్రహ్మస్మి చిత్రాన్ని ప్రకటించాడు. దీని తర్వాత మళ్లీ మనోజ్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అటు సోషల​ మీడియాలో కూడా సైలెంట్‌ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా మంచు మనోజ్‌.. ఓ అసక్తికర వీడియోని షేర్‌ చేశాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

ఈ వీడియోని పోస్ట్‌ చేస్తూ.. ప్రియమైన అభిమానుల కోసం తిరిగొస్తున్నాను.. కొంచెం కొత్తగా.. సరికొత్తగా ర్యాంప్ ఆడించడానికి మీ రాకింగ్ స్టార్ గేమ్ షోతో మళ్లీ వస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు మనోజ్‌. అయితే మంచు వారబ్బాయి రీఎంట్రీ ఇస్తుంది మాత్రం వెండితెరపైకి కాదు.. బుల్లితెరపైకి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈటీవీ సంయుక్తగా మనోజ్ హోస్ట్‌గా ఓ షోను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటుంది. అందులో మనోజ్ తన వాయిస్‌తో అసలు విషయం చెప్పేశాడు.

“నా ప్రపంచం సినిమా. చిన్నప్పటి నుంచి మూవీస్‌ మీద నేను పెంచుకున్న ప్రేమ ఇప్పుడు నా వృత్తిగా మారింది. అదే నన్ను ఒక హీరోని.. నటుడిని చేసింది. అందుకు నాకు రాకింగ్ స్టార్ అనే పేరు కూడా ఇచ్చింది. అభిమానులు, వారు వేసే ఈలలు, అరుపులు, కేకలతో పండగల సాగే నా జీవితంలో అనుకోకుండా ఒక సైలెన్స్ వచ్చింది. మనోజ్ కెరీర్ ముగిసింది.. అయిపోయాడు.. యాక్టింగ్ ఆపేశాడు. ఇక మళ్లీ రాడు అన్నారు. విన్నాను… చూశాను.. అన్నింటిని మౌనంగా భరించాను. ఇప్పుడు తిరిగొస్తున్నాను” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. దీంతో మనోజ్ చేయబోయే షోపై మరింత ఆసక్తి నెలకొంది. వెండితెర మీద రాణించిన మనోజ్‌.. బుల్లితెర మీద సక్సెస్‌ కావాలని కోరుకుటుంన్నారు అభిమానులు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss