iDreamPost
android-app
ios-app

Manchu Manoj: కుమార్తెతో కలిసి ఇంటికి చేరుకున్న మనోజ్ దంపతులు.. వీడియో వైరల్

  • Published Apr 15, 2024 | 9:06 AMUpdated Apr 15, 2024 | 9:06 AM

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి బిడ్డతో కలిసి ఇంటికి చేరుకున్న వీడియో వైరల్ గా మారింది.

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి బిడ్డతో కలిసి ఇంటికి చేరుకున్న వీడియో వైరల్ గా మారింది.

  • Published Apr 15, 2024 | 9:06 AMUpdated Apr 15, 2024 | 9:06 AM
Manchu Manoj: కుమార్తెతో కలిసి ఇంటికి చేరుకున్న మనోజ్ దంపతులు.. వీడియో వైరల్

మంచు వారింటికి చిన్న యువరాణి వేంచేసింది. టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్, మౌనిక దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం అనగా ఏప్రిల్ 13, శనివారం నాడు.. మౌనికా రెడ్డి.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మనోజ్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు అనే విషయాన్ని ఎంతో వెరైటీగా పోస్ట్ చేశారు. పులి చేతిలో చిన్నారి పడుకున్న ఉన్న ఫొటోతో పాటు నలుగురు కుటుంబ సభ్యుల ఏఐ ఫొటోని పోస్ట్ చేసి.. గుడ్ న్యూస్ చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. ఈ శుభవార్తను మొదట మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.

‘దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి చిన్ని యువరాణి వచ్చింది. మనోజ్, మౌనికకు కుమార్తె పుట్టిందని చెప్పడం మాకెంతో సంతోషంగా ఉంది. మేం పాపను ఎమ్‌ఎమ్‌ పులి (మంచు మనోజ్‌ పులి అయ్యుండొచ్చు) అని ముద్దుగా పిలుస్తున్నాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను పంచుకుంది మంచు లక్ష్మి. ఈ న్యూస్ తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మనోజ్, మౌనిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Manoj couple reached home with their daughter

ఇక తాజాగా మనోజ్ దంపతులు తమ చిన్నారి యువరాణిని తీసుకుని.. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మౌనిక, పాప, ధైరవ్ తో కలిసి నేరుగా ఫిలిం నగర్‌లో ఉన్న తన ఇంటికి వచ్చేశారు. చిన్నారిని తొలిసారి ఇంట్లోకి ఆహ్వానిస్తున్న శుభ సందర్భాన హారతి ఇచ్చి పూలు చల్లి.. ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ధైరవ్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.

ఇక పోతే మంచు మనోజ్, మౌనికలు గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. అప్పటికే మౌనికకు ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక కొన్ని నెలల క్రితం మౌనిక ప్రెగ్నెంట్ అన్న వార్తను షేర్ చేశాడు మనోజ్. ఆ తర్వాత మౌనిక సీమంతం ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక ఇప్పుడు కుమార్తె జన్మించడంతో మనోజ్, మౌనికల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మహాలక్ష్మి తమ ఇంటికి వేంచేసిందని సంతోష పడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dhanesh Babu ( Work ) (@endless_celebrity)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి