iDreamPost
android-app
ios-app

నా డబ్బు.. నా ఇష్టం.. నీకేంట్రా నొప్పి.. ట్రోలర్స్‌కి మంచు లక్ష్మి కౌంటర్‌

  • Published Sep 23, 2023 | 9:46 AM Updated Updated Sep 23, 2023 | 9:46 AM
  • Published Sep 23, 2023 | 9:46 AMUpdated Sep 23, 2023 | 9:46 AM
నా డబ్బు.. నా ఇష్టం.. నీకేంట్రా నొప్పి.. ట్రోలర్స్‌కి మంచు లక్ష్మి కౌంటర్‌

మంచు లక్ష్మి.. తెలుగు ప్రజలకు ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మంచు మోహన్‌బాబు కుమార్తెగానే కాక.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులోనే కాక.. వేరే భాషల సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ.. ఫుల్‌ బిజీగా ఉంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటారు మంచు లక్ష్మి. ఇక ఆమె మీద జరిగే ట్రోలింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ వాటిని పెద్దగా పెట్టించుకోరు. మితిమీరితే మాత్రం.. తన స్టైల్లో కౌంటర్‌ ఇస్తారు. ఇక తాజాగా ట్రోలర్స్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మంచు లక్ష్మి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మంచు లక్ష్మి.. వారం రోజుల క్రితం.. ఎయిర్ ఇండియాను ప్రశ్నిస్తూ ఒక పోస్ట్‌ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ చెక్ ఇన్ కౌంటర్ వద్ద రెడ్ కార్పెట్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయని.. దాని గురించి సిబ్బందిని ప్రశ్నిస్తే నవ్వుతున్నారని మంచు లక్ష్మి పోస్ట్‌లో పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత మన హక్కు అన్నారు. నిజానికి ఆ రెడ్ కార్పెట్‌లు అస్సలు బాగోలేవని.. తన ఐఫోన్ కెమెరా వాటిని బాగా చూపించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్‌ చేశారు.

మంచు లక్ష్మి పోస్ట్‌కు ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. తమ ముంబై ఎయిర్‌పోర్ట్ టీమ్‌కి దిశానిర్దేశం చేస్తామని పేర్కొంది. అయితే, మంచు లక్ష్మి చేసిన పోస్ట్‌‌కు ఎప్పటిలాగే నెటిగివ్ కామెంట్ల వర్షం కురిసింది. ముఖ్యంగా ఆమె బిజినెస్ క్లాస్ అని చెప్పడం, తన ఐఫోన్ కెమెరా బాగా తీసింది అనడంతో కొందరు నెటిజనులు ట్రోలింగ్‌ స్టార్ట్‌ చేశారు. ‘ఓహో నువ్వు బిజినెస్ క్లాసులో వెళ్తున్నావని చెబుతున్నావా’, ‘బిజినెస్ క్లాస్, ఐఫోన్‌ని ఎలివేట్ చేద్దామని అనుకున్నావు.. మాకు అర్థమైంది’ అంటూ మంచు లక్ష్మిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. దాంతో మంచు లక్ష్మికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ట్రోలర్స్‌కి కౌంటర్‌ ఇస్తూ వీడియో రిలిజ్‌ చేసింది.

‘‘నేను బిజినెస్‌ క్లాస్‌లో ట్రావెల్‌ చేస్తే మీకేంటి నొప్పి. నాకు ఐఫోన్‌ ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి. నువ్వు కొనిచ్చావా నాకు.. లేదు కదా. నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు.. నీకేంట్రా నొప్పి. నువ్వేదో నాకు డబ్బులిస్తున్నట్టు ఫోజ్‌ కొడుతున్నావు. నేనొక ఐఫోన్ వాడడం, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం తప్పన్నట్టు చూపిస్తున్నారు. నాకు సొంతంగా ప్రైవేట్ విమానం కావాలి. ఏ నీకు వద్దా.. నువ్వు పెద్ద కోరికలు కోరుకోవా.. కలలు కనవా’’ అంటూ ఫైర్ అయ్యారు మంచు లక్ష్మి.

మహిళలు ఏం మాట్లాడకూడదు అంటూ నిబంధనలు పెట్టడమేంటని ప్రశ్నించారు మంచు లక్ష్మి. డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతాను. ‘‘నాకు ఎవ్వరూ ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. మా అమ్మనాన్న కూడా ఇవ్వరు. మీ కష్టమేదే మీరే పడండి అని చిన్నప్పటి నుంచీ నాన్నగారు మాకు నేర్పించారు. నా జీవితంలో నేను పొందుతున్న ఈ ఆనందాలు, సంతోషాలు అన్నీ నేను సంపాదించుకున్నవే’’ అంటూ ట్రోలర్స్‌పై ఘాటుగానే స్పందించారు మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş