iDreamPost
android-app
ios-app

‘మనసంతా నువ్వే’లో ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే?

  • Published Aug 29, 2024 | 12:04 PM Updated Updated Aug 29, 2024 | 12:04 PM

ఉదయ్ కిరణ్- విఎన్ ఆదిత్య కాంబోలో వచ్చిన యూత్ ఫుల్ లవ్ డ్రామా మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరోహీరోయిన్లు. ఇందులో ఉదయ్ కి చెల్లెలిగా నటించిన యాక్రెస్ట్ గుర్తుందా... ఇప్పుడు..

ఉదయ్ కిరణ్- విఎన్ ఆదిత్య కాంబోలో వచ్చిన యూత్ ఫుల్ లవ్ డ్రామా మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరోహీరోయిన్లు. ఇందులో ఉదయ్ కి చెల్లెలిగా నటించిన యాక్రెస్ట్ గుర్తుందా... ఇప్పుడు..

  • Published Aug 29, 2024 | 12:04 PMUpdated Aug 29, 2024 | 12:04 PM
‘మనసంతా నువ్వే’లో ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే?

కెరీర్ తొలి నాళ్లలో లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. చిత్రం, నువ్వు నేను తర్వాత ఉదయ్ నుండి వచ్చిన మరో లవ్ డ్రామా మనసంతా నువ్వే. 2001లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒక్కటిగా నిలిచింది. ఇక ఈ మూవీ హిందీ, తమిళ్, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ చేయడం విశేషం. ఒకప్పుడు సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ రాజు నిర్మించాడు. ఇక హీరోయిన్ రీమాసేన్.. చిత్రం తర్వాత ఉదయ్‌తో మరోసారి జతకట్టింది. ఇప్పటికీ ఎంతో మందికి ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోతుంది. ఇక పాటలు అయితే టాప్ నాచ్. ఆర్పీ పట్నాయక్ ఈ మూవీ తర్వాత సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడ్డారు. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ పేరు వచ్చింది. ముఖ్యంగా ఉదయ్ చెల్లెలి పాత్ర పోషించిన నటికి.

ఇందులో ఉదయ్ చెల్లెలిగా, చంద్రమోహన్ కూతురిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా ఆమె శిరీష. ఎక్కువగా సిస్టర్ క్యారెక్టర్లలో మెరిసింది. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ వంటి చెల్లెలిగా నటించి బాగా ఫేమ్ తెచ్చుకుంది. అందమైన రూపం, ఆకట్టుకునే నటన ఉన్నప్పటికీ హీరోయిన్‌గా చేయని ఆమె.. తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోల సోదరిగానే గుర్తుండిపోతుంది. కానీ అనూహ్యంగా తెరకు దూరం అయ్యింది. చాలా రోజుల తర్వాత ఓ షోలో మెరిసింది. అయితే ఆమె ఉన్నపళంగా మాయం అవ్వడానికి కారణం పెళ్లి. పెళ్లి, పిల్లలు అంటూ నటనకు కాస్త గ్యాప్ తీసుకుంది. సుమారు 8,9 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకున్న ఆమె మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే సినిమాలతో మళ్లీ బిజీగా మారుతుంది.

Manasantha Nuvve, Sirisha Chaturvedula, Oorvasivo Rakshasivo 01

ప్రస్తుతం బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. ప్రగతి కీరోల్ చేస్తున్న ఊర్వశివో, రాక్షసివో సీరియల్లో నటిస్తుంది. ఇందులో హీరోకు మదర్ రోల్ చేస్తుంది శిరీష. ఇందులో ప్రగతికి అక్క పాత్రలో నటిస్తుంది. అలాగే సీతా రాముడి కట్నం సీరియల్లో కూడా సందడి చేస్తుంది. వయస్సుకు చిన్నదైనా పెద్ద పాత్రను పోషిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఆమె కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఒకప్పుడు టీవీ ప్రజెంటర్‌గా వ్యవహరించింది. అలాగే ఇప్పుడు మళ్లీ కెరీర్ రీ స్టార్ట్ చేసిన ఆమెకు సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. మన్మయి అనే చిత్రంలో ఓ కీ రోల్ చేస్తుండగా.. ఇప్పుడు తన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయని, సెట్స్ పైకి వెళ్లాలని తా జాగా ఓ చిన్న బైట్ లో వెల్లడించింది ఆమె. మళ్లీ బిజీగా మారి టాలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేయాలని కోరుకుందాం.

 

View this post on Instagram

 

A post shared by Sirisha Chaturvedula (@actressirishaofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet