Swetha
ఇండస్ట్రీలో మోస్ట్ హైప్డ్ మూవీ ఓజి వచ్చేసింది. ఇంకా ముందు ముందు రావాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ ఏడాది రావాల్సిన వాటిలో అఖండ 2 కె అంత బజ్ ఉంది. ఇక ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలన్నీ కట్ట కట్టుకుని సంక్రాంతి సీజన్ లోనే వస్తున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి.

ఇండస్ట్రీలో మోస్ట్ హైప్డ్ మూవీ ఓజి వచ్చేసింది. ఇంకా ముందు ముందు రావాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ ఏడాది రావాల్సిన వాటిలో అఖండ 2 కె అంత బజ్ ఉంది. ఇక ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలన్నీ కట్ట కట్టుకుని సంక్రాంతి సీజన్ లోనే వస్తున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇక వీటితో పాటు నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు సినిమా కూడా అప్పుడే రాబోతుంది. అది కూడా సరిగ్గా చిరు సినిమా రాబోయే డేట్ నే ఈ సినిమా కూడా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.
అయితే మన శంకర వర ప్రసాద్ గారికి రాజు గారికి మధ్య క్లాష్ రానుంది. చిరంజీవి ఎక్కడ నవీన్ పోలిశెట్టి ఎక్కడా ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది అని అనుకోడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ మధ్య పెద్ద హీరో చిన్న హీరో సినిమా అయినా కంటెంట్ బావుంటేనే జనాలు చూస్తున్నారు. సో ఇప్పుడు ఈ రెండు సినిమాలు దేనికవే స్ట్రాంగ్ గా వాళ్ళ సినిమాను జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రెండు సినిమాల ప్రమోషనల్ కంటెంట్ హాట్ టాపిక్ గా మారనున్నాయి.
పబ్లిసిటీలో అనిల్ రావిపూడి మార్క్ ఎలా ఉంటుందో తెలియనిది కాదు. అందులోను ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా.. వెంకటేష్ తో కాంబినేషన్. ఇక అనిల్ ప్రమోషన్స్ మాములుగా ఉండవు. ప్రస్తుతానికి మూవీ షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. ఇక అనగనగ ఓ రాజు దర్శకుడు మారికి ఇలాంటి ఐడియాస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ.. నవీన్ పోలిశెట్టి మాత్రం ప్రమోషన్స్ బాధ్యత బాగానే తీసుకుంటాడు. సో ఇటు శంకర్ వర ప్రసాద్ గారు అటు రాజు గారు ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.