iDreamPost
android-app
ios-app

అభిమానం అంటే ఇది.. వెంటిలేటర్‌తో షారుఖ్‌ సినిమాకు..

  • Published Sep 20, 2023 | 3:35 PM Updated Updated Sep 20, 2023 | 3:35 PM
  • Published Sep 20, 2023 | 3:35 PMUpdated Sep 20, 2023 | 3:35 PM
అభిమానం అంటే ఇది.. వెంటిలేటర్‌తో షారుఖ్‌ సినిమాకు..

బాలీవుడ్‌ బాద్‌ షా.. షారుఖ్‌ ఖాన్‌ తాజాగా ‘జవాన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సూపర్‌ హిట్‌ను టాక్‌ను అందుకుంది. దేశ వ్యాప్తంగా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 500 ‍కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. విడుదలై దాదాపు 13 రోజులు అవుతున్నా.. సీట్ల ఆక్యుపెన్సీ స్థిరంగానే ఉంది. అభిమానులు ఒకటికి రెండు సార్లు సినిమాను చూసి ఆనందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వివరాల్లోకి వెళితే.. అనీస్‌ ఫూరూఖీ అనే దివ్యాంగుడికి షారుఖ్‌ ఖాన్‌ అంటే ఎంతో ఇష్టం. తాజాగా విడుదలైన జవాన్‌ సినిమాను అనీస్‌ హాల్లో చూడాలని అనుకున్నాడు. అయితే, అతడు వెంటిలేటర్‌ సహాయం లేనిది బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఇంట్లో వాళ్లు వద్దన్నారు. అయినప్పటికి అనీస్‌ వెనక్కు తగ్గలేదు. హాల్లో సినిమా చూసి తీరాలని పట్టుబట్టాడు. అనీస్‌ అలా పట్టుబట్టడంతో కుటుంబసభ్యులు ఏమీ అనలేకపోయారు. వెంటిలేటర్‌తో సహా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అనీస్‌ ఎంతో సంతోషంగా చూసి ఎంజాయ్‌ చేశాడు. వైరల్‌గా మారిన ఆ వీడియో ఇప్పటి వరకు మిలియన్‌కు పైగా వ్యూస్‌ సంపాదించింది. ఇక, వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇది కదా అభిమానం అంటే’’.. ‘‘ షారుఖ్‌ ఖాన్‌కు మాత్రమే ఇలాంటి ఫ్యాన్స్‌ ఉంటారు’’..‘‘ అనీస్‌ను ఆ దేవుడు చల్లగా చూడాలి’’..‘‘ అభిమానం కంటే ప్రాణాలు ముఖ్యం.. జాగ్రత్త అనీస్‌’’ అంటూ మిశ్రమ కామెంట్లు చేస్తున్నారు. మరి,  అనీస్‌ ఫూరూఖీ వెంటిలేటర్‌తో జవాన్‌ సినిమాకు వెళ్లటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom