iDreamPost
android-app
ios-app

వీడియో: పిలిచి మరీ ప్రముఖ నటిని తిట్టిన వ్యక్తి!

  • Published Jul 25, 2023 | 11:34 AM Updated Updated Jul 25, 2023 | 11:34 AM
  • Published Jul 25, 2023 | 11:34 AMUpdated Jul 25, 2023 | 11:34 AM
వీడియో: పిలిచి మరీ ప్రముఖ నటిని తిట్టిన వ్యక్తి!

తరచూ ఏదో ఒక వివాదంతో వార్తలో నిలుస్తూ ఉంటారు నటి ఉర్ఫీ జావెద్‌. వింత, విచిత్రమైన ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్స్‌పై సోషల్‌ మీడియాలోనే కాదు.. నేరుగానూ విమర్శలు వస్తూ ఉంటాయి. వాటిని లెక్క చేయకుండా తన మానాన తాను ఉంటుందామె. మరీ విమర్శలు హద్దులు దాటినపుడు తనదైన స్టైల్లో రిప్లై ఇస్తూ ఉంటుంది. తాజాగా, ఆమెకు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమె వేషధారణను ఉద్దేశిస్తూ దారుణమైన విమర్శ చేశాడు. దీంతో నటికి కోపం వచ్చింది. ఆ వ్యక్తిని లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చింది.

ఇక, ఆ వివరాల్లోకి వెళితే.. నటి ఉర్ఫీ జావెద్‌ ముంబై ఎయిర్‌ పోర్టులో స్నేహితురాలితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చేతుల్లో మంచి నీళ్ల గ్లాసులతో వెళుతున్న ఓ వ్యక్తి ఆమెను పిలిచాడు. ఆ వెంటనే ‘‘నీ లాంటి వాళ్ల వల్లే భారత దేశం పరువు పోతోంది’’ అని మండిపడ్డాడు. దీంతో ఉ‍ర్ఫీ జావెద్‌కు పట్టరాని కోపం వచ్చింది. ‘‘ మీ నాన్నది ఏమైనా పోతోందా? లేదు కదా?.. మర్యాదగా ఇక్కడినుంచి వెళ్లండి అంకుల్‌.. మీ పని మీరు చూసుకోండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపు ఇద్దరి మధ్యా మాటల యుద్దం నడిచింది.

తర్వాత ఉర్ఫీ ఫ్రెండ్‌ కలుగ జేసుకుని గొడవను సద్దుమణిగేలా చేసింది. ఇద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కొన్ని రోజుల క్రితం విమానంలో వెళుతున్న ఉర్ఫీపై కొంతమంది తాగుబోతులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దీంతో ఆమె వారిపై సీరియస్‌ అయింది. తర్వాత ఈ సంఘటనపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టింది. మరి, ఎయిర్‌పోర్టులో నటి ఉర్ఫీ జావెద్‌ను ఓ వ్యక్తి పిలిచి మరీ తిట్టడంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet