iDreamPost
android-app
ios-app

ఖరీదైన కారు కొన్న NTR హీరోయిన్.. ఎన్నికోట్లంటే?

  • Published Feb 09, 2024 | 9:17 PM Updated Updated Feb 09, 2024 | 9:17 PM

ఒకప్పుడు తెలుగు తెరపై కనువిందు చేసిన నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమవుతున్నారు.. అలాంట వారిలో ఎన్టీఆర్ హీరోయిన్ ఒకరు.

ఒకప్పుడు తెలుగు తెరపై కనువిందు చేసిన నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమవుతున్నారు.. అలాంట వారిలో ఎన్టీఆర్ హీరోయిన్ ఒకరు.

  • Published Feb 09, 2024 | 9:17 PMUpdated Feb 09, 2024 | 9:17 PM
ఖరీదైన కారు కొన్న NTR హీరోయిన్.. ఎన్నికోట్లంటే?

ఇటీవల సినీ పరిశ్రమలో రోజు రోజుకీ కొత్త కార్ల కొనే సెలబ్రెటీల సంఖ్య బాగా పెరిగిపోయింది. మార్కెట్ లోకి కొత్త కార్లు, బైకులు వచ్చాయంటే చాలు వెంటనే వాటిని కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా దేశీయ మార్కెట్ లో విడుదలయ్యే ఆధునిక కార్లు ఇతర వస్తువులు కొనుగోలు చేసేవారిలో హీరోల కన్నా హీరోయిన్లే ఎక్కువగా ఉన్నారు. కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు.. ఖరీదైన ఇళ్లు, వాచ్, హ్యాండ్ బ్యాగ్స్, జువెలరీ కొనుగోలు చేస్తూ వాటితో ఫోటోలు తీసుకొని అభిమానుల కోసం సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా కోట్లు ఖరీదు చేసే కారు కొనుగోలు చేసింది ఎన్టీఆర్ హీరోయిన్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

మమతా మోహన్‌దాస్ ఈ పేరు పెద్దగా పరిచయం అక్కరలేదు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ చిత్రంలో అబ్బాయో.. ఓ అబ్బాయా.. అంటూ తన అందాలతో కవ్వించింది. వాస్తవానికి మమతా మోహన్‌దాస్‌ తెలుగు లో విక్టరీ, కృష్ణార్జున, చింతకాయల రవి, కింగ్, కేడీ మూవీస్ లో నటించింది. కానీ ఈ మూవీస్ తో పెద్దగా పేరు రాలేదు. యమదొంగ చిత్రంలో యన్టీఆర్ ని ముప్పతిప్పలు పెట్టే ధనలక్ష్మి పాత్రకు బాగా క్రేజ్ వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించినప్పటికీ మమతా మోహన్‌దాస్‌కి ఎక్కువగా మాలీవుడ్ లోనే పేరు వచ్చింది. నటిగానే కాకుండా సింగర్ గా కూడా తనదైన మార్క్ చాటుకుంది. తెలుగులో రాఖీ.. రాఖీ రాఖీ, ఆకలేస్తే అన్నం పెడతా లాంటి సాంగ్స్ తో అలరించింది.

మమతా మోహన్‌దాస్ ఆ మధ్య క్యాన్సర్ భారిన పడి ఎంతో ధైర్యంగా పోరాడి ఇటీవల కోలుకుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియాలో పదే పదే దర్శనమిస్తుంది. తాజాగా మమతా మోహన్‌దాస్‌.. ఓ ఖరీదైన కారు కోనుగోలు చేసింది. బీఎం‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్ కారు తో తళుక్కున మెరిసింది. దీని ధర దాదాపు కోటి రూపాయల వరకు ఉండవొచ్చని అంటున్నారు. కొత్త కారుకు కొనుగోలు చేసే ముందు షోరూం సిబ్బందితో మాట్లాడటం.. ఫోజులు ఇవ్వడం మొత్తం తన ఇన్‌స్ట్రా పేజీలో షేర్ చేసింది. పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల రుద్రంగి మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by BMW EVM Autokraft (@bmwevmautokraft)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş