iDreamPost
android-app
ios-app

గ్లామరస్ ఫోటోస్ చూసి నెటిజన్ అలా అడిగేసరికి.. మాళవిక మోహనన్ రియాక్షన్

  • Published Apr 29, 2024 | 10:20 PM Updated Updated Apr 29, 2024 | 10:20 PM

ఓ నటి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయగా ఓ నెటిజన్ నుంచి వింతైన ప్రశ్న ఎదురైంది. ఆమెను ట్రోల్ చేసే విధంగా చేసిన కామెంట్ కు స్పందిస్తూ ఆ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఓ నటి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయగా ఓ నెటిజన్ నుంచి వింతైన ప్రశ్న ఎదురైంది. ఆమెను ట్రోల్ చేసే విధంగా చేసిన కామెంట్ కు స్పందిస్తూ ఆ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

  • Published Apr 29, 2024 | 10:20 PMUpdated Apr 29, 2024 | 10:20 PM
గ్లామరస్ ఫోటోస్ చూసి నెటిజన్ అలా అడిగేసరికి.. మాళవిక మోహనన్ రియాక్షన్

సినీ ఇండస్ట్రీలో నటీనటులపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తుండడం సాధారణమైపోయింది. ఏదో ఒక విషయాన్ని పట్టుకుని ఎంతకైనా తెగించి ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. తాజాగా మాళవిక మోహనన్ హీరోయిన్ పై ఓ నెటిజన్ ట్రోలింగ్ కు దిగాడు. ఏకంగా ఆమె గ్లామర్ షోను ఉద్దేశిస్తూ ఎప్పుడూ ఇదేనా యాక్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ అంటూ ట్రోలింగ్ కు పాల్పడ్డాడు. అతడు చేసిన కామెంట్స్ పై గట్టిగా రిప్లై ఇచ్చింది ఈ అమ్మడు. తాజాగా ఈ భామ #AskMalavika సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఫాలోవర్లు, అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో హాట్‌ హాట్‌ లుక్స్‌తో నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. ఈ అమ్మడు చేసే పోస్టు ఏదైనా లైకుల వర్షం కురవాల్సిందే. మాళవిక మోహనన్ 2013లో మళయాళం సినిమా పట్టం పోల్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి తమిళం, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ప్రభాస్‌-మారుతి కాంబోలో వస్తున్న హార్రర్ కామెడీ ప్రాజెక్ట్‌ రాజాసాబ్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. మాళవిక తాజాగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్ లో నెటిజన్స్ రకరకాల ప్రశ్నలు అడగగా అంతేస్థాయిలో బదులిచ్చింది.

కాగా ఓ నెటిజన్ మాత్రం మాళవిక మోహనన్ ట్రోల్ చేస్తూ ఎప్పుడూ ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి? ఇలాంటి ఫోటోలనే ఎందుకు షేర్ చేస్తావ్ అని అడిగితే.. సింపుల్.. నాకు ఇష్టం అంతే అని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ ఈ గ్లామర్ ఫోటోలే కాకుండా ఇక యాక్టింగ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ అనిమరో నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి మాళవిక మోహనన్.. నేను ఎప్పుడూ చేయను.. నీకేమైనా ప్రాబ్లమా? అని నెటిజన్ కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. మీకు ఎలాంటి డ్రీమ్‌ రోల్‌లో నటించాలని ఉందని ఓ నెటిజన్‌ అడిగాడు. దీనికి మాళవిక స్పందిస్తూ.. నేను గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించాలనుకుంటున్నానని తెలిపింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş