ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ ప్రముఖులను కోల్పోతుంది చిత్ర పరిశ్రమ. ఈ ఆరు నెలల కాలంలో నిర్మాత, డైరెక్టర్, సినీ రైటర్స్, టెక్నీషియన్లు చనిపోయారు. ఇప్పుడు మరో దర్శకుడు కన్నుమూశాడు.

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ ప్రముఖులను కోల్పోతుంది చిత్ర పరిశ్రమ. ఈ ఆరు నెలల కాలంలో నిర్మాత, డైరెక్టర్, సినీ రైటర్స్, టెక్నీషియన్లు చనిపోయారు. ఇప్పుడు మరో దర్శకుడు కన్నుమూశాడు.

ఆరు నెలలు గడిచాయో లేదో సినీ ఇండస్ట్రీ దిగ్గజాలను కోల్పోయింది. కమెడియన్స్, సింగర్స్, డైరెక్టర్స్, సినీ రైటర్స్, టెక్నీషియన్స్ ఇలా చాలా మందిని పొగొట్టుకుని శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, చందన సీమలో కూడా పలువురు స్టార్ సెలబ్రిటీలు మరణించారు. ఈ మధ్య కాలంలో రామోజీరావు లాంటి దిగ్గజ నిర్మాతతో పాటు.. కమెడియన్ ప్రదీప్ కె విజయన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. అలాగే అంతకుముందు మాలీవుడ్, బాలీవుడ్ చిత్ర దర్శకుడు సంగీత్ శివన్ మరణించాడు.  నటి నూర్ మాలాబికా దాస్ కూడా ముంబయిలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించింది. మొన్నటికి మొన్న ప్రముఖ యాక్టర్ సిద్దిఖ్ పెద్ద కొడుకు అనారోగ్య సమస్యలతో మరణించాడు.

ఇప్పుడు మరో దర్శకుడు మృతి చెందాడు. మలయాళ దర్శకుడు సుధీర్ బోస్ తుది శ్వాస విడిచాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య ప్రీతా, పిల్లలు మిధున్, సైపర్ణిక ఉన్నారు. ఎఫ్ఇఎఫ్కెఎ డైరెక్టర్స్ యూనియన్.. ఈ విషాయన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కళాభవన్ మణి, రంభ, ముఖేష్ ముఖ్య పాత్రల్లో నటించిన కబడ్డీ కబడ్డీ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 1971లో కేశవన్ నాయర్, సుధా దేవి దంపతులకు జన్మించిన సుధీర్ బోస్.. తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. ప్రముఖ చిత్రనిర్మాతలు జెస్సీ, పిజి విశ్వంభరన్‌ల మార్గదర్శకత్వంలో సహాయ దర్శకుడిగా కెరీర్ స్టార్ చేశాడు..

దర్శకుడు మనుతో అతని సాన్నిహిత్యం 2008లో దివంగత కళాభవన్ మణి, ముఖేష్, రంభ నటించిన ‘కబడ్డీ కబడ్డీ’ చిత్రాన్ని రూపొందించడానికి దారితీసింది. ఈ చిత్రంలో నటీనటులు హరిశ్రీ అశోకన్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రన్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో పాట‌లు మంచి హిట్ అయ్యాయి. సినిమా మంచి హిట్ సాధించింది. ఆ దర్శకుడు మృతితో మాలీవుడ్ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియులు ముగిసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మళయాల ఇండస్ట్రీ దిగ్గజ దర్శకులను కోల్పోయింది. మొన్నటికి మొన్న సంగీత్ శివన్ మరణించాడు. ఇప్పుడు ఈ దర్శకుడు కన్నుమూశాడు.

Show comments