Subbaraman: మెగాస్టార్ కి డైరెక్టర్ క్షమాపణలు.. ఎందుకంటే?

మలయాళ దర్శకుడు ఎస్వీ సుబ్బురామన్ తన తొలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా విషయమై ప్రముఖ నటుడికి క్షమాపణ చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మలయాళ దర్శకుడు ఎస్వీ సుబ్బురామన్ తన తొలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా విషయమై ప్రముఖ నటుడికి క్షమాపణ చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు అందరిని మెప్పించేస్తున్నాయి. ఈ క్రమంలో మలయాళ సినిమాల గురించి ప్రేక్షకులు ఓ కన్నేసి ఉంచారు. ఇక ప్రస్తుతం మలయాళ నటుడు విదార్ద్ , వాని భోజనం జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. అంజామై. ఈ సినిమాతో మలయాళ దర్శకుడు ఎస్వీ సుబ్బురామన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కాగా ఈ సినిమాను ప్రముఖ రచయిత తిరునాఉక్కరుసు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ను విడుదల చేశారు. దీనితో అందరికి ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడు సుబ్బురామన్ ప్రముఖ నటుడికి క్షమాపణ చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అంజామై సినిమా జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథను బట్టి ఈ సినిమా తెలుగులో వస్తుందో లేదో చెప్పలేము కానీ.. థియేటర్ విడుదలకు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. ప్రస్తుతం మూవీ టీం అంతా కూడా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు మాట్లాడుతూ.. “పరిస్థితుల ప్రభావం కారణంగానే ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ సినిమాను నిర్మించిన తీరునావుక్కరుసు ఓ ప్రముఖ రచయిత కూడా. నిజానికి ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించాల్సి ఉంది. ఆయన ఒప్పుకున్నారు కూడా .. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమాలో రఘుమాన్ నటించారు. ఈ సందర్భంగా మమ్ముట్టికి క్షమాపణలు చెప్పుకుంటున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు. దీనితో ఇప్పుడు ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

ఇక అంజామై సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. చట్టాన్ని అధికారికంగా తన చేతిలోకి తీసుకున్న ఓ వ్యక్తి కారణంగా సామాన్యులు ఎలాంటి ఇబ్బందులకు గురి అయ్యారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. దాదాపు నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని చిత్రీకరించారా అనే రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఈ సినిమాను జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. మరి డైరెక్టర్ సుబ్బురామన్ మమ్ముట్టికి క్షమాపణ చెప్పిన విషయంపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments