ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

Director Mohan Passes away: వివిధ సినీ పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెలలోనే సినీ దిగ్గజాలను కోల్పోయింది. తాాజాగా ప్రముఖ దర్శకుడు మృతి చెందడంలో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

Director Mohan Passes away: వివిధ సినీ పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెలలోనే సినీ దిగ్గజాలను కోల్పోయింది. తాాజాగా ప్రముఖ దర్శకుడు మృతి చెందడంలో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. సినీ దిగ్గజాలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. దీతో వారి కుటుంబాల్లోనే కాదు అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమలకు చెందిస సెలబ్రెటీలు వరుసగా కన్నుమూస్తున్నారు. ఇటీవల గేమ్ ఆఫ్ థ్రోన్స్, టైటానిక్ నటులు మృతి చెందగా.. మాలీవుడ్ సీనియర్ నటి కనకలత కన్నుమూసింది. ప్రముఖ దర్శకులు హరి కుమార్, సంగీత్ శివన్ కన్నుమూశారు. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా వర్మ, మాలీవుడ్ నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందే మరో దర్శకుడు కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ ఎం మోహన్ కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎం మోహన్ 23 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇరింగలకుడ క్రైస్ట్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ చదివాడు.తన తండ్రి స్నేహితుల ద్వారా ప్రముఖ దర్శకులు ఎం కృష్ణ నాయర్ ని కలిశాడు. చదువుల్లో రాణిస్తూనే సుకుమారన్ నాయర్, ఎబి రాజ్, మధు, పి వేణు, హరిహరన్ లాంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 1978 లో సూర్ణవీడు మూవీతో దర్శకుడిగా మారాడు ఎం మోహన్. ఆ తర్వాత ‘రాండ్ నగరికాల్’, ‘షాలినీ మైంతే పట్సారి’, ‘విటపరిమ్ సమ్దీ’, ‘ఇలకమనల్’ వంటి మోహన్ చిత్రాలతో దర్శకుడిగా తనదైన సత్తా చాటుకున్నారు. అలోలం, రచన, మంగళం నేరును, తీర్ధ, శ్రుతి, ఒక కథ ఒక నునకథ, ఇసాబెల్లా, కానీ, సాక్ష్యం, సో ఆన్ ఎ వెకేషన్, మీక్ వంటి చిత్రాలన్నీ అందరి దృష్టిని ఆకర్షించాయి.

ముఖం, శ్రుతి, అలోలం విడపరుం సిద్దే చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాశారు. మలయాళ చిత్రసీమలో ఎవరూ తీయని స్వలింగ సంపర్కం ఇతివృత్తంగా వచ్చిన డుపుపెంకుట్టికల్ మూవీతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఇద్దరు అమ్మాయిలు సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రముఖ డ్యాన్సర్ అనుపను పెళ్లి చేసుకున్నారు. వీరికి పుందర్, ఉపేందర్ కుమారులు. 1999లో దర్శకత్వం చివరిసారిగా ఆయన తెరకెక్కించిన ‘అంగే ఒరు వరేయాత్‌’ మంచి విజయం సాధించింది. ఎం మోహన్ కన్నుయడంతో మాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.. సినీ ప్రముఖులు ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నారు.

 

Show comments