iDreamPost
android-app
ios-app

Premalu OTT: ప్రేమ‌లు OTT రిలీజ్ డేట్ ఫిక్స్‌ తెలుగులోనూ స్ట్రీమింగ్

  • Published Mar 14, 2024 | 2:38 PM Updated Updated Mar 14, 2024 | 3:49 PM

మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలు.. ఒరిజినల్ లాంగ్వేజ్ తోనే తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న తర్వాత .. ఈ సినిమాను మార్చి 8న తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ టాక్ కూడా నడుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలు.. ఒరిజినల్ లాంగ్వేజ్ తోనే తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న తర్వాత .. ఈ సినిమాను మార్చి 8న తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ టాక్ కూడా నడుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 14, 2024 | 2:38 PMUpdated Mar 14, 2024 | 3:49 PM
Premalu OTT: ప్రేమ‌లు OTT  రిలీజ్ డేట్ ఫిక్స్‌ తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళ సినిమా అయిన “ప్రేమలు” బ్లాక్ బస్టర్ హిట్ సాదించింది. ఒరిజినల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన కొద్దీ రోజులకే అటు మాలయంలోనే కాకుండా.. ఇటు తెలుగు పప్రేక్షకులను కూడా అద్భుతంగా అలరించింది. ఇక తెలుగు ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ప్రేమలు ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమాను మార్చి 8వ తేదీన .. తెలుగు వెర్షన్ లో విడుదల చేశారు. అప్పటికే ఆడియన్స్ నుంచి హిట్ టాక్ సంపాదించుకున్న ప్రేమలు.. ఇక తెలుగు వెర్షన్ తర్వాత ఏకంగా.. స్టార్ డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు, స్టార్ హీరోల నుంచి ట్వీట్స్ ఒకటి రెండు కాదు.. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు తాజాగా ప్రేమలు ఓటీటీ ఎంట్రీ టాక్ కూడా వినిపిస్తోంది. మరి, ప్రేమలు సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ ఎప్పుడు ! ఏ ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టనుంది అనే విషయాలు చూద్దాం.

సినిమా కథ నచ్చేస్తే.. తెలుగు ఆడియన్స్ ఆ సినిమాకు పెంచే హైప్ అంత ఇంత కాదు. అలాంటి సినిమానే ఈ మలయాళ సినిమా “ప్రేమలు”. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజుకి తెలుగు ఆడియన్స్ లో దక్కిన క్రేజ్ అంత ఇంత కాదు. అందులోను యూత్ కి బాగా కనెక్ట్ అయినా సినిమా ప్రేమలు. దీనితో ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అయినా కూడా.. ఇంకా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీకి . గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఇక తెలుగులో ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేశారు. అయితే, ఇప్పుడు ప్రేమలు సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీగా పోటీపడ్డాయట. వాటిలో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. మార్చి 29నుంచి “ప్రేమలు” సినిమా మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Premalu telugu OTT date fix

అయితే, ప్రేమలు తెలుగు వెర్షన్ రిలీజ్ కాకముందు.. ముందుగా మార్చి మొదటి వారంలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, మార్చి 8న తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడంతో కాస్త డిలే అయినట్లు సమాచారం. ఇక ప్రేమలు సినిమా కథ విషయానికొస్తే .. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ యొక్క బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంది. సచిన్ అనే యువకుడు హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటాడు. కానీ, వీసా రిజెక్ట్ కావడంతో హైదరాబాద్ లో గేట్ కోచింగ్ తీసుకుంటాడు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసే రీను సచిన్ కు పరిచయం అవుతుంది. రీనును అప్పటికే ఆది అనే వ్యక్తి ప్రేమిస్తూ ఉంటాడు. అయితే అప్ప‌టికే ల‌వ్‌లో ఓ సారి ఫెయిలైన స‌చిన్‌…రీనుకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనును ప్రేమిస్తోన్న ఆది ఎవ‌రు? స‌చిన్‌, రీనూ చివ‌ర‌కు ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. మరి, ప్రేమలు” సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet