iDreamPost
android-app
ios-app

మంజుమ్మల్ బాయ్ హీరోను మనువాడబోతున్న వైష్ణవ్ హీరోయిన్

  • Published Apr 03, 2024 | 1:55 PM Updated Updated Apr 03, 2024 | 1:55 PM

తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతుంది. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకి ఆమె ఎవరంటే..

తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతుంది. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Apr 03, 2024 | 1:55 PMUpdated Apr 03, 2024 | 1:55 PM
మంజుమ్మల్ బాయ్ హీరోను మనువాడబోతున్న వైష్ణవ్ హీరోయిన్

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఇండస్ట్రీలో వరుస పెళ్లిల హడావిడి మొదలైంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీస్ తమ పెళ్లి కబురును సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నటుల నుంచి గుడ్ న్యూస్ వినడంతో పెద్ద ఎత్తునే శుభంక్షాంశలు తెలియజేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో మరి కొంతమంది నటి, నటులు అయితే సీక్రెట్ గా ప్రేమలో విహారిస్తూ.. సడెన్ గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఇదే బాటలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా చేరింది. అయితే ఈ హీరోయిన్ గత కొంత కాలంగా తన ఇంటస్ట్రీలో ఉన్న నటుడితో ప్రేమలో ఉందని వార్తలో జోరుగా వినిపించ సాగాయి. ఇలాంటి సమయంలో ఇంకొన్ని రోజుల్లో ఆ హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుందటూ.. అందుకు సంబంధించిన శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతకి ఆమె ఎవరంటే..

‘మనోహరం’, ‘బీస్ట్’ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ ‘అపర్ణా దాస్’ గురించి అందరికి తెలిసిందే. కాగా, ఈ హీరోయిన్ త్వరలో వివాహ బంధంలో అడుగుబెట్టబోతుందని తాజాగా సమాచారం అందింది. అయితే ఈమె మలయాళ హిట్‌ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ హీరోల్లో ఒక‌రిగా క‌నిపించిన ‘దీప‌క్ ప‌రంబోల్‌’తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని వార్త జోరుగా వినిపిస్తుంది.ఈ క్రమంలోనే.. ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా.. కేర‌ళ‌లోని వ‌డ‌క్క‌చేరిలో ఏప్రిల్‌ 24న అప‌ర్ణ‌దాస్‌, దీప‌క్ వివాహం జరగబోతుందని.. వివాహ శుభలేఖ కూడా నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ మేరకు ఆమె ఫ్యాన్‌ అకౌంట్‌ నుంచి కూడా ఈ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.

Aparna das going to marry manjumel boys hero

ఇక అపర్ణ దాస్ మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ నటించిన ‘ఆదికేశ‌వ‌’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో అప‌ర్ణ‌దాస్ వజ్ర కాళేశ్వరీ దేవి అనే పాత్రలో నటించింది. కానీ, ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేదు. దీంతో అపర్ణకు ఈ సినిమా అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది. ఇకపోతే తమిళంలో ‘దాదా’ అనే సినిమాలో ఓ బిడ్డ‌కు తల్లిగా కనిపించిన అప‌ర్ణ‌దాస్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అక్కడ భారీ హిట్‌ కొట్టిన ఈ సినిమా త్వరలో తెలుగులో ‘పా..పా’ పేరుతో విడుదల కానుంది. ఇక దుబాయ్‌లో ఎంబీఏ పూర్తిచేసిన అపర్ణ టిక్‌టాక్ వీడియోల నుంచి విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే.. పలు సినిమాల్లో అవకాశాలను అందుకుంది. మరి, త్వరలో హీరోయిన్ అపర్ణదాస్ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş