iDreamPost
android-app
ios-app

నటన, చదువు రెండింటిని బ్యాలన్స్‌ చేసుకుంది.. నేడు ఎయిర్‌ హోస్టెస్‌గా

  • Published Sep 22, 2023 | 1:39 PM Updated Updated Sep 22, 2023 | 1:39 PM
  • Published Sep 22, 2023 | 1:39 PMUpdated Sep 22, 2023 | 1:39 PM
నటన, చదువు రెండింటిని బ్యాలన్స్‌ చేసుకుంది.. నేడు ఎయిర్‌ హోస్టెస్‌గా

చదువుకునే వయసులో సినిమా అవకాశాలు వస్తే.. ఆపై ఎడ్యుకేషన్‌కు బ్రేక్‌ పడుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే.. సినిమాలు చేస్తూ చదువు కొనసాగిస్తారు. తాజాగా మన దగ్గర సాయి పల్లవి, శ్రీలీల వంటి హీరోయిన్లు.. సినిమాలు చేస్తూనే.. చదువు పూర్తి చేశారు. ఇక తెలుగమ్మాయి.. రేష్మి రాథోడ్‌.. సుప్రింకోర్టు జడ్జ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో ముద్దుగుమ్మ చేరింది. చదువును, నటనను బ్యాలెన్స్‌ చేస్తూ.. ముందుకు సాగింది. చివరకు తనకు ఎంతో ఇష్టమైన కొలువు సంపాదించుకుంది. ఇంతకు ఎవరా నటి అంటే..

మలయాళ నటి కృతికా ప్రదీప్‌.. ఎయిర్‌హోస్టెస్‌గా మారింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్‌ క్రూ మెంబర్‌గా చేరింది. సైకాలజీ పూర్తి చేసిన కృతిక.. ఆ తర్వాత దాదాపు 10 సినిమాల్లో యాక్ట్‌ చేసింది. 2014లో వచ్చిన దిలప్‌ సినిమా.. విల్లాలివీరన్‌లో బాలనటిగా నటించింది. ఆ తర్వాత 2018లో సాజిద్ యాహియా దర్శకత్వం వహించిన ‘మోహన్‌లాల్’ చిత్రంలో.. మంజు వారియర్ పాత్రలో నటించి.. అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ఆది, కూడశ, పథం వలవ్, కుంజెల్దో చిత్రాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కృతికా.

కృతిక కేవలం నటి మాత్రమే కాదు.. గాయని, మోడల్‌ కూడా. ఇక సోషల్‌ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. సైకాలజీ చదివిన తర్వాత సినిమాల్లో నటిస్తూనే, క్యాబిన్ క్రూ ట్రైనింగ్ కూడా పొంది.. చివరకు తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇక తనకెంతో ఇష్టమైన ఎయిర్‌ హోస్టెస్‌ ఉద్యోగం సంపాదించుకుంది కృతిక. ఈ సందర్భంగా విస్తారా ఎయిర్‌లైన్స్ యూనిఫాం, ట్యాగ్ ధరించి తన సహోద్యోగులతో నిలబడి “అధికారికంగా విస్తారా క్యాబిన్ సిబ్బంది” అని క్యాప్షన్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss