iDreamPost
android-app
ios-app

బేబీ నిడివి 3 గంటల పైకి! డ్యూరేషన్ పెంచుతున్న మేకర్స్!

  • Author ajaykrishna Published - 04:08 PM, Sat - 29 July 23
  • Author ajaykrishna Published - 04:08 PM, Sat - 29 July 23
బేబీ నిడివి 3 గంటల పైకి! డ్యూరేషన్ పెంచుతున్న మేకర్స్!

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్.. బేబీ మూవీ హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాతో.. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డెబ్యూ చేసింది. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటించాడు. యూత్ ఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించారు. ఎస్కేఎన్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాపై ముందునుండి నమ్మకంతో ఉన్న మేకర్స్.. ప్రమోషన్స్ మాత్రం గట్టిగా చేశారు. ముఖ్యంగా బేబీ సాంగ్స్ జనాలకు, యూత్ కి బాగా ఎక్కేసాయి. కట్ చేస్తే.. సినిమా ఫస్ట్ డే ఓ మీడియం రేంజ్ మూవీలా కలెక్షన్స్ నమోదు చేసింది. వెరసి రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

అక్కడినుండి వరుసగా ఏమాత్రం ఆగకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. కేవలం రూ. 8 కోట్ల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా.. ఇప్పటిదాకా రూ. 72 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. పెట్టిన బడ్జెట్ కి దాదాపు నాలుగు రేట్లు లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. బేబీ మూవీలో అదనంగా ఓ సాంగ్ తో పాటు.. కొన్ని సన్నివేశాలు యాడ్ చేస్తున్నట్లు డైరెక్టర్ చెప్పారట. దీంతో సినిమాకి అదనంగా మరో 14 నిముషాలు యాడ్ కాబోతుందని సమాచారం.

ఈ లెక్కన బేబీ మూవీ.. ఆల్రెడీ రిలీజ్ నిడివి 2 గంటల 50 నిముషాలు ఉంది. అలాంటిది ఇప్పుడు అదనంగా 14 నిముషాలు యాడ్ చేస్తే.. సినిమా డ్యూరేషన్ 3 గంటలు దాటిపోనుంది. అయితే.. ఈ అదనపు కట్ తో డైరెక్టర్ కట్ గా.. ఆగష్టు 1 నుండి రన్ చేయనున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. న్యూస్ అయితే వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు కథతో పాటు ఎమోషన్స్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ మేజర్ ప్లస్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. మొదటి సినిమాతో వైష్ణవి చైతన్య బ్లాక్ బస్టర్ డెబ్యూ చేయగా.. బేబీ మూవీ ఆనంద్ దేవరకొండకు కెరీర్ ఫస్ట్ కమర్షియల్ హిట్ అని చెప్పవచ్చు. మరి బేబీ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom