Somesekhar
టాలెంటెడ్ యాక్టర్ సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం 'కంగువ'. ఈ మూవీ రిలీజ్ కాకముందే.. మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మరి మేకర్స్ ధైర్యానికి కారణం ఏంటి? చూద్దాం పదండి.
టాలెంటెడ్ యాక్టర్ సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం 'కంగువ'. ఈ మూవీ రిలీజ్ కాకముందే.. మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మరి మేకర్స్ ధైర్యానికి కారణం ఏంటి? చూద్దాం పదండి.
Somesekhar
‘కంగువ’.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ చిత్రం కోసం సూర్య ఫ్యాన్సే కాకుండా.. సగటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ జానరే. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. సినిమా రిలీజ్ కాకముందే.. మేకర్స్ సీక్వెల్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి సూర్యతో పాటుగా మేకర్స్ ధైర్యానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. డైరెక్టర్ శివ ఎంతో అద్భుతంగా ఈ మూవీని మలిచినట్లు గ్లింప్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత చేసిన ప్రకటన ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదల కాకముందే.. సీక్వెల్ ఉంటుందని ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశాడు. అంతే కాకుండా.. ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
నిర్మాత జ్జనవేల్ రాజా మాట్లాడుతూ..”సినిమా ప్రారంభానికి ముందే పార్ట్ 1, పార్ట్ 2 అని అనుకున్నాం. స్టోరీస్ కూడా రెడీగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి పార్ట్ 1 షూటింగ్ మాత్రమే పూర్తి అయ్యింది. సీక్వెల్ ను 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో షూటింగ్ కంప్లీట్ చేస్తాం. కంగువ పార్ట్ 2 జనవరి 2027లో లేదా వేసవిలో తీసుకొస్తాం” అని ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చాడు. పార్ట్ 1 షూటింగ్ ను 185 రోజుల్లో పూర్తి చేశామని, సీక్వెల్ కు అంతకంటే ఎక్కువ టైమ్ పడుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా బాబీ డియోల్ విలన్ గా నటించాడు. 16వ శతాబ్దంలో జీవించిన ఓ యోథుడి కథే కంగువ మూవీ స్టోరీ. సూర్యతో పాటుగా మేకర్స్ కు స్టోరీపై ఉన్న నమ్మకమే ఈ సీనిమాకు సీక్వెల్ ను ముందుగానే ప్లాన్ చేసేలా చేసిందని టాక్. అయితే పార్ట్ 1 ఫలితం చూసి మేకర్స్ ముందుకు వెళ్తారా? లేక మధ్యలోనే ఆపేస్తారా? అన్నది వేచిచూడాలి.