iDreamPost
android-app
ios-app

‘దమ్ మసాలా’ పాటకు సితార డ్యాన్స్ .. లుంగీ కట్టి అదరగొట్టేసిందిగా!

  • Published Feb 03, 2024 | 12:54 PM Updated Updated Feb 03, 2024 | 12:54 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే, ఈ చిత్రంలోని ఓ పాటకు.. సేమ్ స్టెప్స్ తో రిక్రియేట్ చేస్తూ.. తన తండ్రికి డేడికేట్ చేసింది.. ఘట్టమనేని గారాల పట్టి "సితార".

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే, ఈ చిత్రంలోని ఓ పాటకు.. సేమ్ స్టెప్స్ తో రిక్రియేట్ చేస్తూ.. తన తండ్రికి డేడికేట్ చేసింది.. ఘట్టమనేని గారాల పట్టి "సితార".

  • Published Feb 03, 2024 | 12:54 PMUpdated Feb 03, 2024 | 12:54 PM
‘దమ్ మసాలా’ పాటకు  సితార డ్యాన్స్ .. లుంగీ కట్టి అదరగొట్టేసిందిగా!

మహేష్ బాబు ముద్దుల కూతురు “ఘట్టమనేని సితార” గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇంకా సినిమాలలో ఈ చిన్నారి అడుగుపెట్టకపోయినా ఇప్పటికే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంటోంది “సితార”. అటు సమాజానికి సేవ చేయడంలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ.. నిరంతరం యాక్టీవ్ గా ఉంటూ.. తండ్రి వారసత్వాన్ని.. చిన్నతనం నుంచే కొనసాగిస్తోంది.. ఘట్టమనేని గారాల పట్టి “సితార”. అయితే, తాజాగా మహేష్ నటించిన చిత్రం “గుంటూరు కారం”.. థియేటర్లలో సంపాదించుకున్న క్రేజ్ గురించి ఇప్పటివరకు చూస్తూనే వచ్చాము. ఈ క్రమంలో “గుంటూరు కారం” చిత్రంలోని పాటలకు హుక్ స్టెప్స్ ను రిక్రియేట్ చేస్తూ.. అందరు రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ, అందరు చేయడం వేరు.. తన తండ్రికి డేడికేట్ చేస్తూ.. సితార ఘట్టమనేని మహేష్ స్టెప్స్ ను అనుసరించడం వేరు కదా.. అలానే ఈ చిన్నారి చేసిన ఓ డ్యాన్స్ వీడియోకు అందరూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మహేష్ బాబు సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా లేకపోయినా.. తన కూతురు మాత్రం నిత్యం సామజిక మాధ్యమాలలో యాక్టీవ్ గా ఉంటూ.. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా.. బయట కూడా ఎంతో ఉత్సాహంగా అన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. ఇక ఈ చిన్నారి చేసే డ్యాన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు యూట్యూబ్ లోను ఒక ఛానెల్ ను ఓపెన్ చేసి.. చిన్నారులకు ఉపయోగపడే వీడియోలను అడపా దడపా షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, డ్యాన్స్ వీడియోస్ అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. వాటిలో ముఖ్యంగా సితార మహేష్ నటించిన చిత్రాలలో పాటలకే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తను ఏ వీడియో షేర్ చేసినా మిలియన్లలో వ్యూస్ వెళ్తూ ఉంటాయి. ఇక “గుంటూరు కారం ” చిత్రంలో మహేష్ డ్యాన్స్ ఒక రేంజ్ లో చేశాడు. అందులో ముఖ్యంగా “దమ్ మసాలా” పాటకైతే.. థియేటర్ లో మరింత రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సితార ఈ పాటలోని హుక్ స్టెప్స్ ను.. రిక్రియేట్ చేస్తూ.. తన తండ్రికి డేడికేట్ చేస్తూ.. మాస్ స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టేసింది. దీనితో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఇప్పటికే సితారకు ఇన్ స్టాలో దాదాపు రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అటు సినిమాలలో అడుగుపెట్టకుండానే.. చిన్నవయసులో తనకంటూ.. ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సితార. దీనితో రాబోయే రోజుల్లో సితార సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుందనే వార్తలు .. నిత్యం వింటూనే వస్తున్నాం. గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో సితార మాట్లాడుతూ.. తనకు నటనపై ఆసక్తి ఉందనే విషయం చెప్పేసింది. ఇక అభిమానులు కూడా సితార సినీ రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. గుంటూరు కారం సక్సెస్ తర్వాత ప్రస్తుతం మహేష్.. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరి, ప్రస్తుతం సితార పోస్ట్ చేసిన దమ్ మసాలా డ్యాన్స్ వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş