iDreamPost
android-app
ios-app

Sitara Ghattamaneni: మహేష్ బాబు కూతురు సితారకు సైబర్ కష్టాలు.. ఏం జరిగిందంటే?

  • Published Feb 10, 2024 | 8:10 AM Updated Updated Feb 10, 2024 | 8:10 AM

సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను సైతం వదలట్లేదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సైతం సైబర్ కష్టాలు ఎదురైయ్యాయి.

సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను సైతం వదలట్లేదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సైతం సైబర్ కష్టాలు ఎదురైయ్యాయి.

  • Published Feb 10, 2024 | 8:10 AMUpdated Feb 10, 2024 | 8:10 AM
Sitara Ghattamaneni: మహేష్ బాబు కూతురు సితారకు సైబర్ కష్టాలు.. ఏం జరిగిందంటే?

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో ప్రపంచం వేగంగా ముందుకుసాగుతోంది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న సామెతను నిజం చేస్తూ.. కొంత మంది కేటుగాళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని, జనాల అమయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పలు రకాలుగా అమయాకులను దోచుకుంటున్నారు. ఓటీపీలు పంపిస్తూ.. క్షణంలో ఖాతాఖాళీ చేస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను సైతం వదలట్లేదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సైతం సైబర్ కష్టాలు ఎదురైయ్యాయి. అసలేం జరిగిందంటే?

ఘట్టమనేని సితార.. మహేష్ బాబు కూతురిగా తనకంటూ ఓ పేరును, గుర్తింపును దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు యాడ్ ఫిల్మ్ లో నటించి.. తండ్రికి తగ్గ తనయగా పేరొందింది. సహాయంలోనూ మహేష్ ను అనుకరిస్తూ.. సంపాదించిన దాంట్లో కొంత నిర్భాగ్యులకు అందిస్తోంది. ఇక తన సోషల్ మీడియాలో మహేష్ పాటలతో పాటుగా మరికొన్ని సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ.. వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. వాటికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మనందరికి తెలిసిందే. దీంతో మహేష్ తనకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది.

ఇప్పుడు ఇదే క్రేజ్ ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు సితార పేరుతో అభిమానులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ లింక్స్ పంపిస్తూ.. నగదు కాజేస్తున్నారు సైబర్ దొంగలు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మహేష్ టీమ్ స్పందించింది. వెంటనే అలర్ట్ అయిన సూపర్ స్టార్ టీమ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అంతవరకు అభిమానులు సితార పేరుతో వచ్చే ఎలాంటి లింక్స్ ను, రిక్వెస్టులకు స్పందించవద్దని మహేష్ టీమ్ కోరింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మెగాస్టార్ OTT ఎంట్రీ అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet