iDreamPost
android-app
ios-app

బెంగుళూరుకు విస్తరించనున్న AMB సినిమాస్! ప్రముఖ థియేటర్ ప్లేస్ లో..

  • Author ajaykrishna Published - 08:48 AM, Sat - 5 August 23
  • Author ajaykrishna Published - 08:48 AM, Sat - 5 August 23
బెంగుళూరుకు విస్తరించనున్న AMB సినిమాస్! ప్రముఖ థియేటర్ ప్లేస్ లో..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపారంలో కూడా యాక్టీవ్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2018లో హైదరాబాద్ లో AMB సినిమాస్‌ మల్టీప్లెక్స్ తో ఫిల్మ్ ఎగ్జిబిషన్ బిజినెస్ లో అడుగుపెట్టాడు మహేష్. అతి కొద్దికాలంలోనే AMB సినిమాస్ ఇండియాలో బెస్ట్ థియేటర్స్ లో ఒకటిగా పేరొందింది. ఇప్పుడు ఇదే ఏఎంబి సినిమాస్ ని బెంగుళూరులో ప్రారంభించనున్నారు మహేష్.. అలాగే తన పార్టనర్ ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్. అయితే.. బెంగళూరులో ఏఎంబి మల్టీప్లెక్స్ ని ప్రముఖ కపాలి థియేటర్ లో నిర్మిస్తున్నారు. కపాలి థియేటర్ ని పునరుద్దరించి అందులో AMB సినిమాస్ ని సిద్ధం చేస్తున్నారు.

బెంగుళూరులో సినిమా లవర్స్ ఎక్కువే. తెలుగు సినిమాలను కూడా విపరీతంగా ఆదరిస్తుంటారు. రెగ్యులర్ గా తెలుగు స్టార్స్ సినిమాలను.. అక్కడి స్టార్స్ సినిమాల మాదిరే చూసేందుకు ఇష్టపడతారు. ఇండియాకి ఐటీ రాజధాని అయిన బెంగుళూరులో ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ అనేది సరైన ఆలోచన అని టాక్ వినిపిస్తుంది. ఎంతో సౌకర్యవంతమైన ఏఎంబి సినిమాస్ ని మెల్లగా మేజర్ సిటీస్ లో స్థాపించి.. చైన్ ని దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉన్నారట మహేష్. ప్రస్తుతం కపాలి థియేటర్ ప్లేస్ లో ఏఎంబి మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏఎంబి సినిమాస్ కి ఇది సెకండ్ బ్రాంచ్.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నిర్మిస్తున్న ఏఎంబి థియేటర్ లో కూడా దాదాపు 5 నుండి 6 స్క్రీన్స్ ఉండబోతున్నాయట. ఇప్పటికి నలభై శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని.. మొత్తం పూర్తి కావడానికి మరో రెండేళ్లు సమయం పట్టవచ్చు అని అంచనా వేస్తున్నారు. బెంగుళూరులోని లాలజ బార్, మేజెస్టిక్ అన్నమ్మ టెంపుల్ రోడ్ ఏరియాలో ఏఎంబి సినిమాస్ నిర్మితం అవుతుంది. ఇక దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు ప్రెజెంట్ బిగ్ ప్రాజెక్ట్ లతో బిజీ అయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తో గుంటూరు కారం తర్వాత.. రాజమౌళితో బిగ్గెస్ట్ మూవీ చేయనున్నాడు. మరి మహేష్ ఏఎంబి సినిమాస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet