iDreamPost
android-app
ios-app

కుబేరా సినిమా కోసం మహేష్ బాబు..!

  • Published Nov 14, 2024 | 2:50 PM Updated Updated Nov 14, 2024 | 2:50 PM

Mahesh Babu : తమిళ హీరో అయినా కానీ ధనుష్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏ ఉంది. ప్రస్తుతం ఈ తమిళ హీరో తెలుగులో చేస్తున్న మూవీ 'కుభేర'. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తో ప్రేక్షకులలో సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్తల్లో సడెన్ గా మహేష్ బాబు పేరు వినిపిస్తుంది.

Mahesh Babu : తమిళ హీరో అయినా కానీ ధనుష్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏ ఉంది. ప్రస్తుతం ఈ తమిళ హీరో తెలుగులో చేస్తున్న మూవీ 'కుభేర'. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తో ప్రేక్షకులలో సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్తల్లో సడెన్ గా మహేష్ బాబు పేరు వినిపిస్తుంది.

  • Published Nov 14, 2024 | 2:50 PMUpdated Nov 14, 2024 | 2:50 PM
కుబేరా సినిమా కోసం  మహేష్ బాబు..!

తమిళ హీరో అయినా కానీ ధనుష్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏ ఉంది. ప్రస్తుతం ఈ తమిళ హీరో తెలుగులో చేస్తున్న మూవీ ‘కుభేర’. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తో ప్రేక్షకులలో సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. భారీ అంచనాల మధ్యన కుభేర రూపొందుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు వచ్చినట్లు సమాచారం. షూటింగ్ అయిన వెంటనే భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక్కసారి ప్రమోషన్స్ మొదలు పెడితే .. అప్పుడు సినిమా ప్లాట్ ఏంటి అనేది ప్రేక్షకులకు అర్ధమౌతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్తల్లో సడెన్ గా మహేష్ బాబు పేరు వినిపిస్తుంది.

మహేష్ చూస్తే ఓ పక్క రాజమౌళికి కమిట్ అయ్యి ఉన్నాడు. ఆ సినిమా కోసం మునుపెన్నడూ లేని లుక్ లో తయారౌతున్నాడు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా చూస్తూనే ఉన్నాము. అటు మరో వైపు జక్కన్న కూడా షూటింగ్ పనులు స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎలాంటి డిస్కషన్స్ కానీ బజ్ కానీ లేదు. మరి సడెన్ గా ఇప్పుడు కుభేర మూవీ డిస్కషన్స్ లో మహేష్ పేరు ఎందుకు వినిపిస్తుందా.. అని అందరికి ఆశ్చర్యం వేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటా అని ఆరా తీస్తే ఈ విషయం బయటపడింది. త్వరలోనే కుభేర మూవీ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ గ్లిమ్ప్స్ ను మహేష్ బాబు చేతులో మీదుగా సోషల్ మీడియాలో షేర్ చేయించబోతున్నారట. మహేష్ తో విడుదల చేయించడం ద్వారా.. కుభేర మూవీ స్థాయి మరింత పెరగడంతో పాటు. మంచి రెస్పాన్స్ కూడా వస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మహేష్ కూడా ఈ గ్లిమ్ప్స్ రిలీజ్ కి ఒకే చెప్పినట్లు సమాచారం.

ఇక కుభేర సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మొదటి సారి నాగార్జున కంప్లీట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ధనుష్ , నాగార్జున మధ్య ఉండే సన్నివేశాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని టాక్ నడుస్తుంది. గ్లిమ్ప్స్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. మహేష్ తో విడుదల చేయిస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. సో మొత్తానికి కుభేర సినిమాపై భారీగా అంచనాలు పెంచేసి.. ప్రేక్షకుల మధ్య క్యూరియాసిటీ పెంచేసి.. ఆ తర్వాత మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetmoon girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis