iDreamPost
android-app
ios-app

నిహారిక కోసం రంగంలోకి దిగిన మహేశ్ బాబు.. ఎందుకోసమంటే?

  • Published Aug 12, 2024 | 4:19 PM Updated Updated Aug 12, 2024 | 4:19 PM

Mahesh Babu- Committee Kurrollu Movie- Niharika Konidela: సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మెగా డాటర్ నిహారిక కొణిదెలకు తన మద్దతు తెలియజేసి మరోసారి సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు.

Mahesh Babu- Committee Kurrollu Movie- Niharika Konidela: సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మెగా డాటర్ నిహారిక కొణిదెలకు తన మద్దతు తెలియజేసి మరోసారి సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు.

  • Published Aug 12, 2024 | 4:19 PMUpdated Aug 12, 2024 | 4:19 PM
నిహారిక కోసం రంగంలోకి దిగిన మహేశ్ బాబు.. ఎందుకోసమంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. టాలీవుడ్ లో ప్రేక్షకులకు ఈయన రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాడు. రీసెంట్ గా మురారి రీ రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మహేశ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుంది అనే విషయాన్ని అందరూ చూశారు. సాధారణంగా మహేశ్ బాబు తన సినిమాలు తాను చేసుకోవడం మాత్రమే కాకుండా.. న్యూ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలోకి ఎవరైనా కొత్త గా వచ్చినా.. ఏదైనా కొత్త ప్రయోగం చేసినా కూడా అభినందించడంలో మహేశ్ బాబు ముందుంటాడు. అలాగే ఇప్పుడు మెగా డాటర్ కు అభినందనలు చెప్పడమే కాకుండా.. తన మద్దతు కూడా తెలియజేసినట్లు అయ్యింది.

కమిటీ కుర్రాళ్లు చిత్రంతో టాలీవుడ్ లోకి 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయం అయ్యారు. అలాగే మెగా డాటర్ నిహారిక కూడా నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కేవలం మూడ్రోజుల్లోనే కమిటీ కుర్రాళ్లు చిత్రం లాభాల్లోకి ఎంటర్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం మూడ్రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 6.04 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అంటున్నారు. అలాగే చిన్న సినిమా అయినా కూడా కంటెంట్ ఉంటే కలెక్షన్స్ అవే వస్తాయి అనే విషయం మరోసారి చెప్పినట్లు అయ్యింది. అంతేకాకుండా.. బొమ్మ హిట్టు అనే సందేశం అయితే వెళ్లిపోయింది. ఈ మూవీపై సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా రియాక్ట్ అయ్యాడు. త్వరలోనే మూవీని చూస్తాను అంటూ ట్వీట్ చేశాడు.

“కమిటీ కుర్రాళ్లు మూవీ గురించి చాలా గొప్పగా వింటున్నాను. నిర్మాతగా నీ తొలి చిత్రానికి నిహారిక నీకు శుభాకాంక్షలు. సినిమా సక్సెస్ సాధించడంపై మూవీ టీమ్ మొత్తానికి నా అభినందనలు. త్వరలోనే ఈ మూవీని చూస్తాను” అంటూ మహేశ్ బాబు పోస్ట్ చేశాడు. ఇప్పటికే సూపర్ టాక్ సొంతం చేసుకున్న కమిటీ కుర్రాళ్లు మూవీ.. ఇప్పుడు మహేశ్ రియాక్ట్ అయిన తర్వాత మరింత బజ్ సొంతం చేసుకుంది. మహేశ్ ఫ్యాన్స్ మొత్తం సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మూడ్రోజుల్లో లాభాల్లోకి వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు మహేశ్ ఇచ్చిన మద్దతుతో మరింత దూసుకుపోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆగస్టు 15 నుంచి పెద్ద సినిమాలు రిలీజులు ఉన్న నేపథ్యంలో మహేశ్ చేసిన ఈ సపోర్ట్.. కమిటీ కుర్రాళ్లు ఇంకా పోటీలో నిలేచేందుకు అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. ఈ మూడ్రోజుల్లో మరిన్ని లాభాలు తెచ్చుకునేందుకు ఆస్కారం కూడా ఉంటుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss