iDreamPost
android-app
ios-app

వైరల్‌గా మహేష్‌ బాబు మేనల్లుడి స్టంటు వీడియోలు!

  • Published Nov 08, 2023 | 3:25 PM Updated Updated Nov 08, 2023 | 3:25 PM

సుధీర్‌ బాబు కుమారుడు చరిత్‌ మానస్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు గత కొద్ది రోజుల నుంచి సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చరిత్‌ అచ్చం మామలా మ్యానిరిజాన్ని కలిగి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సుధీర్‌ బాబు కుమారుడు చరిత్‌ మానస్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు గత కొద్ది రోజుల నుంచి సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చరిత్‌ అచ్చం మామలా మ్యానిరిజాన్ని కలిగి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

  • Published Nov 08, 2023 | 3:25 PMUpdated Nov 08, 2023 | 3:25 PM
వైరల్‌గా మహేష్‌ బాబు మేనల్లుడి స్టంటు వీడియోలు!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు- హీరో సుధీర్‌ బాబు బావ, బావమరదులు అన్న సంగతి తెలిసిందే. మహేష్‌ బాబు చెల్లెలు ప్రియదర్శినిని సుధీర్‌ బాబు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. సుధీర్‌ బాబు పెద్ద అబ్బాయి పేరు చరిత్‌ మానస్‌. గత కొద్దిరోజులనుంచి చరిత్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. మహేష్‌ అల్లుడు చరిత్‌ అచ్చం మేనమామలాగే ఉన్నాడు.

అచ్చం జిరాక్స్‌ తీసినట్లు..  లుక్స్‌, మ్యానరిజం విషయంలోనూ మహేష్‌లానే ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్‌కు సుధీర్‌ బాబుతో ఆయన ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. వారిద్దరూ అలా ఓ సినిమా ఈవెంట్‌కు వెళ్లటం అదే మొదటి సారి. సుధీర్‌ బాబు స్టేజి మీదకు వచ్చిన తర్వాత ఆయనతో పాటు చరిత్‌, అతడి తమ్ముడు కూడా వచ్చారు. అయితే, చరిత్‌ స్టేజిపైకి నడుచుకుంటూ వచ్చిన తీరు.. అతడి లుక్స్‌ అచ్చం మహేష్‌ బాబును పోలి ఉండటంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

ఇక, అప్పటినుంచి చరిత్‌కు సంబంధించిన ఏ చిన్న వీడియో అయినా సరే సోషల్‌ మీడియా చక్కర్లు కొట్టడం మొదలైంది. ముఖ్యంగా మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఆ వీడియోలను తెగ వైరల్‌ చేస్తున్నారు. చరిత్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. చరిత్‌ కొన్ని స్టంట్లు చేస్తూ ఉన్నాడు. ఆ స్టంట్లు చూస్తున్న నెటిజన్లు.. స్టంట్ల విషయంలో అల్లుడు మామను గుర్తు చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

మహేష్‌ తన సినిమాల్లో చాలా రిస్కీ స్టంట్లు చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. టక్కరి దొంగ సినిమా టైంలో ఆయన అత్యంత ప్రమాదకరమైన రైల్‌ స్టంటు చేశారు. చాలా సినిమాల్లో  ఎంత రిస్కీ అయినా సరే తన స్టంట్లు తానే చేస్తారు. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ వన్‌ నేనొక్కడినే’ సినిమాలో కూడా ఓ రిస్కీ స్టంట్‌ చేశారు. తనకు ఈత రాకపోయినా.. సముద్రంలో బోటు సీక్వెన్స్‌ చేశారు. ప్రమాదం అని తెలిసినా కూడా వెనక్కు తగ్గలేదు. ఆ పోలికే ఇప్పుడు అల్లుడికి వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.

ఇక, చరిత్‌ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే.. అతడ్ని అన్ని రకాలుగా సిద్దం చేస్తున్నారన్న టాక్‌ నడుస్తోంది. మహేష్‌ బాబు, సుధీర్‌ బాబు ఫ్యాన్స్‌ చరిత్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అంతేకాదు! చరిత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యాన్స్‌ కూడా చెబుతున్నారు. మరి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన మహేష్‌ అల్లుడి వైరల్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet