మురారి రీ-రిలీజ్‌కి ఊహించని కలెక్షన్లు! రెండు రోజులకు ఎంతంటే?

Mahesh Babu Murari Movie Re Release: ఇండస్ట్రీలలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు నటించిన పాత సినిమాలు రీ-రిలీజ్ చేస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు. అంతేకాదు రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్లు బాగా రాబడుతున్నాయి. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన మురారి ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతుంది.

Mahesh Babu Murari Movie Re Release: ఇండస్ట్రీలలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు నటించిన పాత సినిమాలు రీ-రిలీజ్ చేస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు. అంతేకాదు రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్లు బాగా రాబడుతున్నాయి. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన మురారి ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతుంది.

ఇటీవల స్టార్ హీరోలు ఒకపుడు నటించిన హిట్ సినిమాలు రీ- రిలీజ్ అవుతున్నాయి.  తమ అభిమాన హీరోల సినిమాలు ధియేటర్లో మళ్లీ చూసే అవకాశం రావడంతో ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు వారి పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లోల రిలీజ్ అయి దుమ్మురేపుతున్నాయి.  కొన్ని సినిమాల కలెక్షన్లు అంతంత మాత్రంగా ఉన్నా.. కొన్ని సినిమాల కలెక్షన్లు మాత్రం ఊహించని విధంగా రావడంతో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోతున్నారు. తాజాగా  సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మురారి’ మూవీ రీ-రిలీజ్ అయి ఊహించని కలెక్షన్లు రాబడుతుంది.  వివరాల్లోకి వెళితే. .

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు (ఆగస్ట్ 9) సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్కించిన క్లాసిక్ మువీ ‘మురారి’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ మూవీలో మహేష్ బాబు సరసన సొనాలీ బింద్రే నటించింది. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆట్టుకుంటుంది. ఈ మూవీలో ప్రతి సాంగ్ సూపర్ హిట్. ఇందులో ‘అలనాటి రామచంద్రుడు’ అనే సాంగ్ ఇప్పటికే మారుమోగుతూనే ఉంటుంది.  అప్పట్లో ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ ని ఒక మలుపు తిప్పిందని అంటారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం మహేష్ బాబు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. థియేటర్లలో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు భారీగానే వసూళ్లు చేస్తున్నాయి. రెండు రోజుల్లో ఎంత కలెక్షన్లు వసూళ్లు చేసిందో చూద్దాం.

2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే :

  • నైజాం – 4.21 కోట్లు
  • సీడెడ్ – 42 లక్షలు
  • ఆంధ్రా – 1.53 కోట్లు
  • ఏపీ- తెలంగాణ మొత్తం కలెక్షన్లు – 6.16 కోట్లు గ్రాస్
  • కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 54 లక్షలు
  • ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు
  • మొత్తం వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు – 7.32 కోట్లు గ్రాస్
Show comments