iDreamPost
android-app
ios-app

అఫీషియల్: ముఫాసా కు మహేష్ వాయిస్ ఓవర్..తెలుగు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే

  • Published Aug 21, 2024 | 12:53 PM Updated Updated Aug 21, 2024 | 12:53 PM

Mahesh Babu Voice for Mufasa: ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ తో బిజీ బిజీగా ఉన్న మహేష్.. ఓ హాలీవుడ్ మూవీలో భాగమౌతున్నారంటూ.. రీసెంట్ గా కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Mahesh Babu Voice for Mufasa: ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ తో బిజీ బిజీగా ఉన్న మహేష్.. ఓ హాలీవుడ్ మూవీలో భాగమౌతున్నారంటూ.. రీసెంట్ గా కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 21, 2024 | 12:53 PMUpdated Aug 21, 2024 | 12:53 PM
అఫీషియల్: ముఫాసా కు మహేష్ వాయిస్ ఓవర్..తెలుగు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే

హాలీవుడ్ లోని మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో ఒకటి ముఫాసా:ది లయన్ కింగ్. 2019 లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమాకు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు ప్రిక్వెల్ గా ఇప్పుడు ‘ముఫాసా:ది లయన్ కింగ్’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు బారి జెంకిన్స్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఓ బడా ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న మహేష్.. ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు రీసెంట్ గా కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పడు ఆ వార్తలే నిజమయ్యాయి.

ముఫాసా ది లయన్ కింగ్ మూవీలో.. ముఫాసా క్యారెక్టర్ కు మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మహేష్ ఇప్పటివరకు చాల వాటికి వాయిస్ ఓవర్స్ ఇచ్చారు కానీ.. ఇలాంటి క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పడం మాత్రం ఇదే మొదటి సారి. దీనితో మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ న్యూస్ తో పాటు.. ఈ మూవీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ ను ఆగష్టు 26 ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహేష్ పూర్తయిందని సమాచారం. కాబట్టి ఈ ట్రైలర్ లో దాదాపుగా మహేష్ వాయిస్ వినిపించే అవకాశం ఉంది. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాను ఇంగ్లిష్ తో పాటు.. తెలుగు , హిందీ. తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక తెలుగులో ఈ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే.. హిందీలో షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పనున్నారు. ఇక మహేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం మహేష్ లుక్ పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రేక్షకులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో వేచి చూడాలి. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారట మేకర్స్. ఆ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ను త్వరలోనే రివీల్ చేయనున్నారు. మరి ముఫాసా:ది లయన్ కింగ్ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.