మురారీ రీ రిలీజ్‌.. థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్స్‌!

Murari Movie Re Release: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ సందర్భంగా ఆ హీరో అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తు సంబరాలు జరుపుకుంటున్నారు.

Murari Movie Re Release: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ సందర్భంగా ఆ హీరో అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తు సంబరాలు జరుపుకుంటున్నారు.

సాధారణంగా స్టార్ హీరోలకు హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు సంబరాల్లో తేలిపోతుంటారు.. పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి బాణా సంచా కాల్చుతూ.. పాలాభిషేకం చేస్తూ రచ్చ చేస్తుంటారు. ఇక పుట్టిన రోజు వేడుకలు అభిమాన సంఘాలు వాడ వాడలా నిర్వహిస్తుంటారు.. స్వీట్లు పంచుతూ, రక్తదానశిభిరాలు నిర్వహిస్తూ తమ అభిమానం చాటుకుంటారు. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ మూవీ నేడు ధియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది హార్డ్ కోర్ అభిమానులు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’, ‘ఒక్కడు’ మూవీస్ రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో మహేష్ బాబు సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. మహేష్ బాబు నటించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీస్ చూసి థియేటర్లలో ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డస్ లాంటి చోట్ల సింగ్ స్క్రీన్ థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’ మూవీ అప్పట్లో క్లాసిక్ మువీగా మంచి హిట్ అందుకుంది. ఇందులో అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడు’ అనే పాట ఇప్పటికీ మారుమోగిపోతుంది. ఎక్కడ పెళ్లిళ్లు జరిగినా ఈ పాట వినిపిస్తుంది.

ఈ పాటలో మహేష్ బాబు, సోనాలి బింద్రె పెళ్లిపీటలపై సీన్లు చూడ ముచ్చటగా ఉంటాయి. తాజాగా థియేటర్లలో ఈ సీన్లు తమ కెమెరాల్లో బందించారు ఫ్యాన్స్. మరికొన్ని చోట్ల చేతిలో అక్షింతలు తీసుకువెళ్లి ఆ సీన్లు వచ్చినపుడు తెరపై జల్లుతున్నారు. ఓ థియేటరో అభిమాని నిజంగానే తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో పక్క నుంచి వారిపై తలంబ్రాలు జల్లారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఇదేం అభిమానం రా నాయనా.. ఇలా కూడా చేస్తారా? అంటున్నారు. మరికొంతమంది ఇదెక్కడి మాస్ రా మావా.. అభిమానం ఇలా కూడా చాటుకుంటారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments