iDreamPost
android-app
ios-app

Mahesh Babu: తండ్రిని తలచుకుని మహేశ్ బాబు ఎమోషనల్.. పోస్ట్ వైరల్!

  • Published May 31, 2024 | 12:56 PM Updated Updated May 31, 2024 | 12:56 PM

తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకుని మహేశ్ బాబు ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పొస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకుని మహేశ్ బాబు ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పొస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published May 31, 2024 | 12:56 PMUpdated May 31, 2024 | 12:56 PM
Mahesh Babu: తండ్రిని తలచుకుని మహేశ్ బాబు ఎమోషనల్.. పోస్ట్ వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్రవేశారు. టాలీవుడ్ కు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో నటశేఖరుడిగా వెలుగొందారు. అయితే ఈ రోజు(మే 31) సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తండ్రిని తలచుకుని మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. ఘట్టమనేని రాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు కృష్ణ. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. నటనపై ఆసక్తితో చదువు పూర్తి చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్ లో దాదాపు 350 సినిమాలు చేశారు. చివరి శ్వాస వరకు సినిమాలకు దూరం కాలేదు సూపర్ స్టార్. 2022 నవంబర్ 15న తుదిశ్వాస విడిచారు. దాంతో తెలుగు ఇండస్ట్రీ ఓ నట శిఖరాన్ని కోల్పోయింది.

కాగా.. మే 31న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్బంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రిని తలచుకుని మహేశ్ బాబు ఓ ఎమెషనల్ పోస్ట్ చేశారు. “హ్యాపీ బర్త్ డే నాన్నా.. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం. కానీ నా ప్రతీ జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ నిలిచే ఉంటారు” అంటూ కృష్ణ యంగ్ ఏజ్ లో దిగిన పిక్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom