iDreamPost
android-app
ios-app

Mahesh Babu: గుంటూరు కారం విడుదలకి ముందే మహేశ్ మరో రికార్డు! ఇదీ మాస్ అంటే!

  • Published Dec 13, 2023 | 1:44 PM Updated Updated Dec 13, 2023 | 1:44 PM

గుంటూరు కారం సినిమా విడుదలకు ముందే మహేష్‌ బాబు మరో రికార్డును క్రియేట్‌ చేశారు. ప్యాన్‌ ఇండియా స్టార్లను సైతం వెనక్కు నెట్టేశారు. టాప్‌లో నిలిచారు..

గుంటూరు కారం సినిమా విడుదలకు ముందే మహేష్‌ బాబు మరో రికార్డును క్రియేట్‌ చేశారు. ప్యాన్‌ ఇండియా స్టార్లను సైతం వెనక్కు నెట్టేశారు. టాప్‌లో నిలిచారు..

  • Published Dec 13, 2023 | 1:44 PMUpdated Dec 13, 2023 | 1:44 PM
Mahesh Babu: గుంటూరు కారం విడుదలకి ముందే మహేశ్ మరో రికార్డు! ఇదీ మాస్ అంటే!

మహేష్‌ బాబు మోస్ట్‌ అవేటింగ్‌ మూవీ ‘గుంటూరు కారం’ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. త్రివిక్రమ్‌-మహేష్‌ బాబు కాంబోలో వస్తున్న మూడో సినిమా కావటంతో ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. గుంటూరు కారం నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్‌ మూవీపై అంచనాలను పెంచుతూ పోతోంది. పాటలకు అయితే, మంచి స్పందన వచ్చింది. విడుదల దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో మహేష్‌ బాబు రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాడు.

తాజాగా, ఆయన ఖాతాలోకి మరో కొత్త రికార్డు వచ్చి చేరింది. ఈ చిత్రం భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ విడుదల కానుంది. ముఖ్యంగా అమెరికాలో పెద్ద మొత్తం థియేటర్లలో సినిమా సందడి చేయనుంది. అక్కడ ప్రీమియర్స్‌ కూడా ఉండనున్నాయి. ఈ ప్రీమియర్స్‌ విషయంలో మహేష్‌ బాబు కొత్త రికార్డు క్రియేట్‌ చేశారు. పాత రికార్డులను తిరగరాశారు. అమెరికా ప్రీమియర్స్‌ విషయంలో దాదాపు 4 కోట్ల రూపాయల కలెక్షన్లు కొట్టిన సినిమాల్లో మహేష్‌ బాబువే ఎక్కువ ఉన్నాయి.

దాదాపు మహేష్‌ నటించిన ఎనిమిది చిత్రాలు అమెరికా ప్రీమియర్స్‌లో 4 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. తర్వాతి స్థానంలో ‍ప్రభాస్‌ ఉన్నాడు. ఆయన నటించిన ఆరు సినిమాలు నాలుగు కోట్ల మార్కును చేరాయి. సలార్‌తోనూ ఆయన ఈ మార్కును చేరుకున్నారు. సలార్‌ ప్రీ సేల్స్‌తోనే 4 కోట్లను రాబట్టింది. ప్రభాస్‌ తర్వాతి స్థానాల్లో.. ఎన్టీఆర్‌ -4, చిరంజీవి – 4, పవన్‌ కల్యాణ్‌ -4, అల్లు అర్జున్‌ -2, రామ్‌ చరణ్‌ -2, బాలకృష్ణ -2, విజయ్‌ దేవరకొండ -1, నాని -1  ఉన్నారు.

కాగా, గుంటూరు కారం చిత్రం నుంచి ఈ రోజు ఓ పాట విడుదల కానుంది.  ‘ ఓ మై బేబీ’ అనే రొమాంటిక్‌ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ చిత్రాన్ని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల్ని దిల్‌ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఈ మూవీ కోసం డబ్బులు పెట్టినట్లు సమాచారం. సంక్రాంతి బరిలో గుంటూరు కారంకు పోటీ గట్టిగా ఉంది. నాగార్జున నటించిన ‘నా సామిరంగ’, వెంకటేష్‌ నటించిన ‘ సైంధవ్‌, ప్యాన్‌ ఇండియా సినిమా ‘హానుమాన్‌’లు కూడా సంక్రాంతికే రానున్నాయి.

ఈ సినిమాలో పోల్చుకుంటే.. గుంటూరు కారంకు ఎక్కువ బజ్‌ ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్‌ క్రేజ్‌ ఎలాగూ ఉండనే ఉంది. దీంతో మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనటంతో ఎలాంటి అతిశయోక్తిలేదు. మరి, గుంటూరు కారం విడుదలకి ముందే మహేశ్ మరో రికార్డు క్రియేట్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom