iDreamPost
android-app
ios-app

మేనల్లుడి కోసం మహేష్..! అందుకోసమేనా?

  • Published Oct 28, 2024 | 5:50 PM Updated Updated Oct 28, 2024 | 5:50 PM

ప్రస్తుతం మహేష్ బాబు జక్కన్నతో మూవీ తీస్తున్న సంగతి తెలియనిది కాదు. రాజమౌళితో మూవీ అంటే ఇక మహేష్ ను మర్చిపోవాల్సిందే. కానీ ఇప్పుడు మరో సినిమాలో మహేష్ కనిపించబోతున్నాడు. దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు జక్కన్నతో మూవీ తీస్తున్న సంగతి తెలియనిది కాదు. రాజమౌళితో మూవీ అంటే ఇక మహేష్ ను మర్చిపోవాల్సిందే. కానీ ఇప్పుడు మరో సినిమాలో మహేష్ కనిపించబోతున్నాడు. దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 28, 2024 | 5:50 PMUpdated Oct 28, 2024 | 5:50 PM
మేనల్లుడి కోసం మహేష్..! అందుకోసమేనా?

మహేష్ బాబు ఆఖరి మూవీ గుంటూరు కారం. ఆ సినిమా రిలీజ్ టైమ్ కే జక్కన్నతో మూవీ కన్ఫర్మ్ అయింది. సో ఆ సినిమా తర్వాత బాబుని ఇప్పట్లో తెరపై చూడలేమని బెంగ పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఇప్పడు వినిపిస్తున్న బజ్ ప్రకారం అభిమానులకు కాస్త రిలీఫ్ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే జక్కన్నతో మూవీ కంటే ముందే.. మహేష్ బాబును మరొక మూవీలో చూడొచ్చు. సాధారణంగా ఒక్కసారి రాజమౌళితో మూవీ ఫిక్స్ అయ్యిందంటే. ఇక ఆ హీరో డైరెక్ట్ గా సినిమా రిలీజ్ టైం లో తప్ప.. ఇంకెక్కడ కనిపించడు. కానీ మహేష్ విషయంలో అలా జరగడం లేదు. మొన్నీమధ్యనే సోషల్ మీడియాలో తన లుక్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆ సినిమా కంటే ముందే మహేష్ దర్శనం మరో సినిమాలో అవుతుంది. అటు రాజమౌళి చూస్తే.. మూవీ షూట్స్ కోసం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాడు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. మరి ఈలోపే మహేష్ మరో మూవీలో కనిపించడం ఏంటి అని అనుకుంటున్నారా.. అదేంటంటే..

ప్రస్తుతం మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా.. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో.. దేవకీనందన వాసుదేవ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు కృష్ణుడి గెటప్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఆ గెటప్ లో కాసేపు స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ ఇప్పటివరకు  అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోర్సు నుంచి వస్తున్న సమాచారం వింటుంటే మాత్రం ఇది కన్ఫర్మ్ అని అర్ధమౌతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన షూట్ కూడా రెండు నెలల క్రితమే పూర్తి చేసారని.. పైగా రాజమౌళి ఆమోద ముద్ర కూడా పడిందని సమాచారం. ఇదే కనుక నిజం అయితే.. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగే. ఎందుకంటే రాజమౌళితో సినిమా ఇప్పటిలో అయ్యేది కాదు. సో ఈలోపు ఓసారైనా మహేష్ ను స్క్రీన్ మీద చూస్తే అదే చాలని భావిస్తూ ఉంటారు అభిమానులు.

ఇక అశోక్ గల్లా నటిస్తున్న దేవకీ నందన వాసుదేవ సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు ఈ సినిమా మీద మరీ అంతా బజ్ అయితే లేదు. దీపావళి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్. ఈ సినిమాకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించాడు. దాదాపు ఇప్పటివరకు సినిమాను ప్రశాంత్ వర్మ పేరు మీదే ఎక్కువ మార్కెట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా నుంచి టీజర్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు మహేష్ పేరు బయటకు రావడంతో.. ఈ సినిమా మీద అందరికి కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకవేళ మహేష్ క్యామియో నిజంగా ఉంటే కనుక అది సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. కాకపోతే మహేష్ బాబు కనిపించేది కొద్దీ సేపే కాబట్టి పరిమితంగా ఎక్స్పెక్ట్ చేయడం బెటర్. ఇక రాజమౌళి సినిమా విషయానికొస్తే.. ఆల్రెడీ జక్కన్న  లొకేషన్స్ వేటలో ఉన్నాడు. ఒక్కసారి అవి ఫైనల్ అయ్యాయంటే ఇక సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చే అప్డేట్స్ కోసం ఎదురుచూడడమే. మరి మేనల్లుడి కోసం మహేష్ తెరపైకి రావడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet