iDreamPost
android-app
ios-app

రవీందర్‌పై మహాలక్ష్మి సంచలన ఆరోపణలు!

  • Published Sep 29, 2023 | 9:03 PM Updated Updated Sep 29, 2023 | 9:03 PM
  • Published Sep 29, 2023 | 9:03 PMUpdated Sep 29, 2023 | 9:03 PM
రవీందర్‌పై మహాలక్ష్మి సంచలన ఆరోపణలు!

ప్రముఖ తమిళ సీరియల్స్‌ నిర్మాత రవీందర్‌- నటి మహాలక్ష్మిల ప్రేమ వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లి కారణంగా ఈ జంట సోషల్‌ మీడియా వ్యాప్తంగా చాలా రకాల ట్రోలింగ్స్‌ను ఎదుర్కొంది. ఆ తర్వాత రవీందర్‌-మహాలక్ష్మి విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు సైతం వచ్చాయి. వాటిపై ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. తాము ఎప్పటికీ కలిసే ఉంటామని అన్నారు. అయితే, రవీందర్‌ ఓ చీటింగ్‌ కేసులో నెల రోజుల క్రితం జైలు పాలయ్యారు. ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.

ఇలాంటి ఈ సమయంలో మహాలక్ష్మి తన భర్త రవీందర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రవీందర్‌ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె తన స్నేహితుల దగ్గర వాపోయారంట. రవీందర్‌ చీటింగ్‌ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి విషయాలు చెప్పలేదని అన్నారంట. పెళ్లికి ముందు ఈ విషయాలేవీ తెలీవని ఆవేదన వ్యక్తం చేశారట. ఇప్పుడు మహాలక్ష్మి వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను సంచలనాన్ని సృష్టించాయి. భవిష్యత్తు గురించి మహాలక్ష్మి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

పెళ్లి చేసుకుని రెండేళ్లు కూడా గడవకుండానే ఈ జంట జీవితం ఇలా అవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొందరు మహాలక్ష్మికి సపోర్టు చేస్తుంటే.. మరికొందరు ఆమెను ట్రోల్స్‌ చేస్తున్నారు. భర్త జైలుకు వెళితే.. సాయం చేయాల్సింది పోయి ఇలా చేస్తావా అంటూ మండిపడుతున్నారు. రవీందర్‌ జైలు పాలైన కొన్ని రోజులకే ఆమె ఫొటో షూట్‌ నిర్వహించటం.. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్త దూరమయ్యాడన్న బాధ ఆమెలో కనిపించటం లేదని అంటున్నారు. మరి, మహాలక్ష్మి తన భర్త రవీందర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom