iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటి బావ, అక్కను చంపేసిన మిలిటెంట్లు..

  • Published Oct 10, 2023 | 9:19 PM Updated Updated Oct 10, 2023 | 9:19 PM
  • Published Oct 10, 2023 | 9:19 PMUpdated Oct 10, 2023 | 9:19 PM
ప్రముఖ నటి బావ, అక్కను చంపేసిన మిలిటెంట్లు..

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు దాదాపు 2,400 మంది మృత్యువాత పడ్డారు. హమాస్‌ మిలిటెంట్లు అత్యంత పాశవికమైన దారుణాలకు పాల్పడుతున్నారు. కనిపించిన వారిని కనిపించినట్లు చంపేస్తున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రాణాలు తీస్తున్నారు. భారత దేశానికి చెందిన వారు కూడా హమాస్‌ గ్రూపు చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి మధురా నాయక్‌ అక్కా, బావలు కూడా హమాస్‌ గ్రూపు చేతిలో మృత్యువాత పడ్డారు.

ఈ విషయాన్ని స్వయంగా మధురా నాయకే బయటకు వెల్లడించారు. ఈ మేరకు నిన్న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘‘ మా అక్కా, బావలు పాలస్తీనియన్‌ టెర్రరిస్టుల చేతిలో అత్యంత దారుణంగా చంపబడ్డారు. వారిని వారి పిల్లల కళ్ల ముందే చంపేశారు. ఆదివారం ఈ దారుణం జరిగింది. మా అక్క చనిపోవటం చాలా బాధగా ఉంది. ఆమె ఆత్మకు దేవుడు శాంతి కలిగించుగాక. ఈ కష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలవండి. ఇప్పుడే ప్రజలు టెర్రిరిస్టుల అసలు రూపం చూస్తున్నారు.

వారు ఎంత దారుణంగా ప్రవరిస్తున్నారో అర్థం అవుతోంది’’ అని రాసుకొచ్చారు. అక్కా, బావ వారి పిల్లలతో ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. మధురా నాయక్‌ పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై స్పందింస్తున్న నెటిజన్లు, ఆమె అభిమానులు సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, మధురా నాయక్‌ బాలీవుడ్‌లో నాగినీ, కసాతీ జిందగీకే, ఉత్తరన్‌ సీరియల్స్‌లో నటించారు. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, పాలస్తీనియన్‌ టెర్రరిస్టుల దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Madhura Naik 🧿 (@madhura.naik)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet