iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి మ్యాడ్‌.. ఎప్పుడు? ఎక్కడంటే?

అతి త్వరలో ‘‘ మ్యాడ్‌’’ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌ 3వ తేదీనుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుంది. కాగా, మ్యాడ్‌ సినిమా

అతి త్వరలో ‘‘ మ్యాడ్‌’’ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌ 3వ తేదీనుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుంది. కాగా, మ్యాడ్‌ సినిమా

ఓటీటీలోకి మ్యాడ్‌.. ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీ ప్రియుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయిన కొద్దిరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. జనం థియేటర్‌కు వెళ్లి వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా.. ఎలాంటి శ్రమ లేకుండా ఇంట్లో కూర్చుని సినిమాలు చూసేస్తున్నారు. కొన్ని సినిమాలు నెల కూడా దాటకుముందే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తాజా తెలుగు సూపర్‌ హిట్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌ అయింది.

అతి త్వరలో ‘‘ మ్యాడ్‌’’ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌ 3వ తేదీనుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుంది. కాగా, మ్యాడ్‌ సినిమా కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఇది ఓ ముగ్గురు అమాయకులైన స్నేహితుల కథ. ఇక, ఆ ముగ్గురు అమాయకమైన స్నేహితుల పాత్రల్లో నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌లు నటించారు. వీరికి జంటగా శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనతిక సునీల్‌కుమార్‌, గోపిక ఉద్యాన్‌లు నటించారు. ప్రముఖ దర్శకుడు కేవీ అనుదీప్‌ శిష్యుడు కల్యాణ్‌ శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ‘మ్యాడ్‌’ సినిమా తెరకెక్కింది. అక్టోబర్‌ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. ఈ సినిమాలో దర్శకుడు కేవీ అనుదీప్‌ కూడా ఓ పాత్ర చేయటం విశేషం. మ్యాడ్‌ సినిమా ఫంక్షన్‌లో అనుదీప్‌ మాట్లాడుతూ.. తాను నటుడిగా నటించే చివరి సినిమా ‘మ్యాడ్‌’ అంటూ సంచలన ప్రకటన చేశారు. మరి, మ్యాడ్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయానలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet