లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్’.. OTT పార్టనర్ ఫిక్స్!

  • Author ajaykrishna Updated - 11:32 PM, Thu - 2 November 23
  • Author ajaykrishna Updated - 11:32 PM, Thu - 2 November 23
లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్’.. OTT పార్టనర్ ఫిక్స్!

టాలీవుడ్ కథల విషయంలో కొత్త పుంతాలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా ఆడియన్స్ రెగ్యులర్ సినిమాలు చూడట్లేదని గ్రహించిన మేకర్స్. ఇప్పుడు పంథా మార్చి.. కొత్త తరహా కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రొటీన్ స్టోరీ అయినా కొత్తగా ఏమైనా కనిపించినా ప్రేక్షకులు హిట్ చేసి పెడుతున్నారు. ఈ వారం టాలీవుడ్ లో దాదాపు పది సినిమాల వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలుసు కదా! వాటిలో సూపర్ టాక్ ని సొంతం చేసుకున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ ‘మ్యాడ్'(MAD). యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. ముందునుండి మేకర్స్ చెప్పినట్లుగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వస్తే.. సినిమా పరిస్థితి ఏంటనేది తెలిసిందే. అందులోనూ యూత్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫన్ వేలో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. అక్టోబర్ 6న రిలీజ్ అయ్యింది. ఇందులో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు హీరోలుగా నటించగా.. గౌరీ ప్రియా, ఆనంతిక, గోపిక ఉదయన్ హీరోయిన్స్ గా మెరిశారు. అయితే.. ఇప్పుడీ మ్యాడ్ మూవీ.. తెలుగు రాష్ట్రాలలో యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం.. మ్యాడ్ ఓటిటి పార్టనర్ ని లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. మ్యాడ్ మూవీ టైటిల్ కి తగ్గట్టుగా యూత్ కి ఫుల్ కిక్కిస్తుందని ఆడియన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేదని.. ఒకరకంగా కాలేజీ ఫుల్ మొత్తం ఇందులో చూపించినట్లు తెలుస్తుంది. అయితే.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు.. ఎన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలైనా.. ఆఖరికి థియేట్రికల్ రన్ అయిపోయాక ఓటిటిలోకి రావాల్సి ఉంటుంది. మ్యాడ్ కూడా థియేట్రికల్ రన్ తర్వాత ఏ ఓటిటిలోకి వస్తుందో తెలిసి పోయింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. మ్యాడ్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో రన్ అవుతోంది. కాబట్టి.. మున్ముందు ఓటిటి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. మరి మ్యాడ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments