iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నది.. ఒక్క హిట్‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది! గుర్తుపట్టారా?

  • Published Sep 03, 2024 | 3:13 PM Updated Updated Sep 03, 2024 | 3:13 PM

ఈ ఫోటోలో చిన్నది.. ఒక్క హిట్‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ మూవీతోనే కుర్రకారు మదిలో గుడి కట్టేసింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరంటే..?

ఈ ఫోటోలో చిన్నది.. ఒక్క హిట్‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ మూవీతోనే కుర్రకారు మదిలో గుడి కట్టేసింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరంటే..?

  • Published Sep 03, 2024 | 3:13 PMUpdated Sep 03, 2024 | 3:13 PM
ఈ ఫోటోలో చిన్నది.. ఒక్క హిట్‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది!  గుర్తుపట్టారా?

కొంత మంది నటీమణులు ఫస్ట్ మూవీతోనే కట్టిపడేస్తుంటారు. చేసినవీ చిన్న పాత్రలే అయినా గుండెల్లో గుర్తుండిపోయేలా యాక్ట్ చేస్తుంటారు. తన క్యూట్ అండ్ స్మైలీ నటనతో అభిమానుల్ని సంపాదించుకుంటారు. గ్లామరస్ షో చేయకుండా ఫ్యాన్స్ పెంచుకోవచ్చునని నిరూపిస్తున్నారు. అందులో ఈ చిన్నారి కూడా ఒకరు. నాటీ స్మైల్‌తో ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నది టాలీవుడ్ యంగ్ హీరోయిన్. పరాయి ఇండస్ట్రీ నుండి వచ్చిన తన చక్కనైన నటనతో ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే సెటిల్ ఫెర్మామెన్స్‌తో మెప్పించి స్టార్ బ్యూటీగా మారిపోయింది. మొత్తంగా చేసినవి రెండు సినిమాలే అయినా.. మ్యాజిక్ చేసేసింది. ఇంతకు ఆమె ఎవరంటే గోపికా ఉద్యాన్. ఇలా అర్థం కాదు కానీ.. మ్యాడ్ మూవీలో రాధ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఇందులో సంగీత్  శోభన్ అలియాస్ డీడీకి ఫ్రెండ్‌గా నటిస్తుంది.

చిన్నప్పటి నుండి డీడీని భరిస్తూ ఉంటుంది రాధ. అతడితో గొడవ పడుతుంది. హెల్ప్ చేస్తుంది. కానీ ఆమెను కాదని వెన్నెలను ప్రేమిస్తుంటాడు. వెన్నెలను క్రియేట్ చేసి డీడీని ఆడుకుంటారు అశోక్, మనోజ్( నార్నే నితిన్, రామ్ నితిన్). చివరకు నిజం తెలుస్తుంది. వెన్నెలగా లెటర్స్ రాసింది ఈ రాధనే అని తెలుస్తుంది. ఈ నటినే గోపికా ఉద్యాన్. ఆమె కూడా మాలీవుడ్ నుండి వచ్చిన సోయగం. గోపికా.. దుబాయ్‌లో పుట్టి పెరిగింది. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసింది. సినిమాలపై ఆసక్తితో మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేసి.. మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2021లో ఆసిఫ్ అలీ హీరోగా వచ్చిన కుంజేల్దోలో నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు వడ్డాయి. అలా ఈ కేరళ కుట్టి టాలీవుడ్‌లోకి మ్యాడ్ మూవీతో అడుగు పెట్టింది.

ఇక సోషల్ మీడియాలో కూడా చక్కటి ఫోటోలతో యూత్‌ను కనువిందు చేస్తుంది గోపికా ఉద్యాన్. గ్లామరస్ ఫోటోల కన్నా.. చక్కనైన కట్టుబొట్టుతో ఉండే చిత్రాలతో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. ఇన్ స్టాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య 100 మిలియన్స్‌కు దగ్గరగా ఉంది. ఇక మ్యాడ్ మూవీలో ఆమెకే కాదు.. తెలుగమ్మాయి గౌరీ శ్రీ ప్రియ, అవంతిక సనీల్ కుమార్‌కు కూడా ఫ్యాన్స్ అయిపోయారు ఆడియన్స్. ఈ మూవీతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా వచ్చిన ఆయ్ చిత్రంతో కూడా మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఆయ్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Gopika Udayan (@gopikaaudayan)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet