iDreamPost
android-app
ios-app

కుమ్మేసిన చిన్న సినిమా.. MAD మూవీ 1st డే కలెక్షన్స్!

  • Author Soma Sekhar Updated - 12:01 PM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 12:01 PM, Fri - 3 November 23
కుమ్మేసిన చిన్న సినిమా.. MAD మూవీ 1st డే కలెక్షన్స్!

వీకెండ్ అయితే చాలు బాక్సాఫీస్ దగ్గరికి చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతాయి. అయితే రిలీజ్ అయిన అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేవు. తాజాగా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఓ చిన్న సినిమా థియేటర్ల వద్ద పెను సంచలనాన్నే సృష్టించింది. ఆ సినిమానే ‘మ్యాడ్’. సైలెంట్ గా విడుదలైన ఈ మూవీ తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. వసూళ్ల పరంగా కూడా ఫస్ట్ డేనే భారీ కలెక్షన్స్ రాబట్టింది. మరి మ్యాడ్ మూవీ తొలిరోజు ఎంత కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

‘మ్యాడ్’ మూవీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన చిత్రం. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సితారా ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాను నిర్మించింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించగా.. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను యుత్ కు కనెక్ట్ అయ్యేలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సాలిడ్ టాక్ తో దూసుకెళ్తోంది. దీంతో తొలిరోజే దాదాపు బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెట్టింది.

కాగా.. రూ. 2 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజే రికార్డు స్థాయిలో రూ. 1.8 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా నిర్మాణ సంస్థ షోషల్ మీడియాలో పంచుకుంది. అయితే శనివారం, ఆదివారాలు వీకెండ్ కావడంతో.. ఈ మూవీకి వసూళ్లు భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లాంగ్ రన్ లో మ్యాడ్ మూవీకి సాలిడ్ కలెక్షన్లు రావడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో 55K డాలర్స్ మార్క్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. తొలిరోజే దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చిన మ్యాడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరికి లాభాల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş