iDreamPost
android-app
ios-app

సాధారణంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్!

  • Published May 02, 2024 | 4:54 PM Updated Updated May 02, 2024 | 4:54 PM

ఈ ఫోటోలో అత్యంత సాదా సీదాగా కనిపిస్తున్న అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గ్లామరస్ పాత్రలే కాదు.. డీ గ్లామరస్ పాత్రలతో కూడా ఫేమ్ తెచ్చుకోవచ్చునని నిరూపించింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో అత్యంత సాదా సీదాగా కనిపిస్తున్న అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గ్లామరస్ పాత్రలే కాదు.. డీ గ్లామరస్ పాత్రలతో కూడా ఫేమ్ తెచ్చుకోవచ్చునని నిరూపించింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

  • Published May 02, 2024 | 4:54 PMUpdated May 02, 2024 | 4:54 PM
సాధారణంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్!

హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలకే కట్టుబడి పడిపోవాలన్న తీరు నేడు ఇండస్ట్రీలో మారింది. డీ గ్లామరైజ్డ్ పాత్రలో కూడా సత్తా చాటవచ్చు అని నిరూపిస్తున్నారు కొంత మంది భామలు. గ్లామర్ రోల్స్ రాకపోయినా.. తమను తాము ఎస్టాబ్లీష్ చేసుకోవడానికి నిడివి తక్కువున్నా, మేకప్ లేని పాత్రలకైనా సై అంటున్నారు. రెమ్యునరేషన్ తక్కువైనా పర్వాలేదు.. తమ క్యారెక్టర్ బాగుండాలని కోరుకుంటున్నారు. బిగ్ హీరోల సినిమాల్లో సరసన ఆడి పాడకపోయినా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకుంటూ వారెవ్వా అనిపిస్తున్నారు. ఇదిగో ఆ కోవలోకి వస్తుంది ఈ బ్యూటీ కూడా. ఇంచు మించు అన్ని సినిమాల్లో డీ గ్లామర్ పాత్రలు పోషించిన అమ్మడికి ఇప్పుడు అలాంటి పాత్రే  అవార్డును తెచ్చిపెట్టింది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూశారు కదా.. చూడటానికి చాలా బొద్దుగా, సాదాసీదాగా ఉన్న ఈ భామ టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. ఇండస్ట్రీలోకి రాక ముందు ఇలా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తెరపై చాలా పద్దతిగా కనిపిస్తూ.. సోషల్ మీడియాలో మాత్రం కాక రేపుతోంది.  ఇప్పుడు గ్లామరస్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ అచ్చ తెలుగు అమ్మాయి. చాలా మంది హీరోయిన్లు.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని అంటుంటారు. కానీ ఈ నటి డాక్టరై.. ఆ తర్వాత యాక్టర్ కూడా అయ్యింది. ఇంతకు ఈ ఫోటోలోని ముద్ద పప్పు అవకాయ ఎవరు అంటే.. 2018 మిస్ తెలంగాణ డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ చేసి.. అపోలో ఆసుపత్రిలో కొంతకాలం డాక్టరుగా పనిచేసిన కామాక్షి.. తర్వాత మోడల్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మిస్ తెలంగాణ పోటీల్లో విన్నర్ అయ్యింది.

ప్రియురాలు అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ తెలుగందం.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, మా ఊరి పొలిమేర, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో కనిపించింది. అలాగే ఝాన్సీ, సైతాన్, దూత వెబ్ సిరీస్‌ల్లో తనదైన నటనతో మెప్పించింది. కానీ ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం పొలిమేర మూవీనే. లక్ష్మి పాత్రలో సత్యం రాజేష్ భార్యగా నటించి మెప్పించింది. గతంలో చాలా బొద్దుగా ఉండే ఆమె.. సినిమాల కోసం నాజుగ్గా మారింది. ఆమె చేసినవి చాలా వరకు డీ గ్లామరస్ పాత్రలైనా సరే మెప్పించింది. ఇప్పుడు ఆ పాత్రే ఆమెకు అవార్డును తెచ్చిపెట్టాయి. న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో కామాక్షికి అరుదైన గౌరవం దక్కింది.  పొలిమేర 2లో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా  అవార్డు వచ్చింది. ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది కామాక్షి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss