iDreamPost
android-app
ios-app

లస్ట్‌స్టోరీ 2 నటి సంచలన వ్యాఖ్యలు.. భర్త వల్లే ఆ సీన్లలో నటించిందట!

  • Published Dec 14, 2023 | 1:02 PM Updated Updated Dec 14, 2023 | 1:02 PM

ఇప్పుడు ఓటీటీకి హద్దులు లేవు. మాలీవుడ్ నుండి హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లను వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ ఏడాది కూడా చాలా మూవీస్, వెబ్ సిరీస్‌లు ఆకట్టుకున్నాయి. వాటిల్లో ఒకటి ఆంథాలసీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ సిరీస్‌లో

ఇప్పుడు ఓటీటీకి హద్దులు లేవు. మాలీవుడ్ నుండి హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లను వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ ఏడాది కూడా చాలా మూవీస్, వెబ్ సిరీస్‌లు ఆకట్టుకున్నాయి. వాటిల్లో ఒకటి ఆంథాలసీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ సిరీస్‌లో

  • Published Dec 14, 2023 | 1:02 PMUpdated Dec 14, 2023 | 1:02 PM
లస్ట్‌స్టోరీ 2 నటి సంచలన వ్యాఖ్యలు.. భర్త వల్లే ఆ సీన్లలో నటించిందట!

ఇటీవల కాలంలో ఆంథాలజీ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఆంథాలజీ అంటే వేర్వేరు ఘటనలు, పరిస్థితులు, కథల సమాహారం. పిట్ట కథలు, మీట్ క్యూట్, మోడ్రన్ లవ్ హైదరాబాద్, ఘోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ వంటివి ఈ కోవ కిందకు వస్తాయి. వీటిల్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా.. విశేష ఆదరణ పొందింది లస్ట్ స్టోరీస్. ఇప్పటి వరకు రెండు సిరీస్‌లు వచ్చాయి. ఎంతటి విమర్శలు వచ్చాయో.. అంతగా ప్రేక్షకులను కనెక్ట్ చేశాయి. లస్ట్ స్టోరీస్ 2లో మన తెలుగు స్టార్ నటి తమన్నా భాటియా, మృణాల్ ఠాకూర్ రెచ్చిపోయిన నటించిన సంగతి విదితమే. ఈ వెబ్ సిరీస్‌లో కూడా నాలుగు కథలు ఉన్నాయి.

నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ లస్ట్ స్టోరీస్-2ను చాలా మంది వీక్షించే ఉంటారు. నాలుగు వేర్వేరు కథలను నలుగురు దర్శకులు హ్యాండిల్ చేశారు. అయితే ఇందులో విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్న స్టోరీ మాత్రం ప్రముఖ దర్శకురాలు కొంకణా సేన్ తెరకెక్కించిన ‘ది మిర్రర్’ ఎపిసోడ్. ఈ మొత్తం వెబ్ సిరీస్‌కు ఈ ఎపిసోడే హైలెట్. ఇందులో సెక్స్ సీన్లలో నటించింది ప్రముఖ నటి అమృతా సుభాష్. ఆమె సీమా అనే పనిమనిషి పాత్రలో నటించింది. అయితే ఈ సీన్లు చేసే సమయంలో ఎంత ఇబ్బందికి గురైందో ఓ కార్యక్రమంలో వెల్లడించింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ యాక్టర్ రౌండ్ టేబుల్ 2023 కార్యక్రమాన్ని చేపట్టగా.. కరీనా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, సాన్యా, తిలోత్తమ, జైదీప్ అహ్లావత్‌తో పాటు అమృతా కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లస్ట్ స్టోరీస్‌లో పనిమనిషి సీమా పాత్రలో బెడ్రూమ్ సీన్లలో నటించేటప్పుడు తాను పడ్డ ఇబ్బందిని గురించి తెలిపింది అమృత. ‘ నేను ముందుగా స్క్రిప్ట్ చదవగానే అందులో ఇంటిమేట్ సీన్లు ఉన్నాయనిపించింది. వెంటనే భయపడ్డాను. అందులో నా భర్తగా నటించిన శ్రీకాంత్ యాదవ్‌తో ఒక రోజు ఈ సీన్ల గురించి చర్చించాలని కొంకణాతో చెప్పాను. శ్రీకాంత్ యాదవ్ చాలా ఏళ్లుగా నా బెస్ట్ ఫ్రెండ్. అతడు నా భర్తకు కూడా స్నేహితుడే. దీంతో అతడితో ఇలాంటి సీన్లలో నటించాలంటే కొంచెం ఆలోచించాను. అయితే ఇలాంటి సీన్లు నువ్వు చేయగలవని నా భర్తే ప్రోత్సహించాడు. ఆ తర్వాత షూటింగ్‌కు ముందు ఒక రోజంతా కొంకణా సేన్ బెడ్ రూంలో మేం గడిపాం. సీన్లు గురించి చర్చించాం. మాతో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా ఉన్నాడు’ అని చెప్పింది అమృత.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş