Krishna Kowshik
Kerala Floods కేరళలోని వరద బాధితులను మద్దుతుగా నిలుస్తుంది మాలీవుడ్. కేవలం మలయాళ ఇండస్ట్రీనే కాకుండా కోలీవుడ్ ప్రముఖులు కూడా బాధితులకు సపోర్టుగా నిలవడంతో పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ తన వంతు సాయాన్ని ప్రకటించింది.
Kerala Floods కేరళలోని వరద బాధితులను మద్దుతుగా నిలుస్తుంది మాలీవుడ్. కేవలం మలయాళ ఇండస్ట్రీనే కాకుండా కోలీవుడ్ ప్రముఖులు కూడా బాధితులకు సపోర్టుగా నిలవడంతో పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ తన వంతు సాయాన్ని ప్రకటించింది.
Krishna Kowshik
కేరళలోని వయనాడ్ జిల్లాను అతలాకుతలం చేశాయి వరదలు. అర్థరాత్రి జరిగిన ఈ ఘోరకలికి నాలుగు గ్రామాలు బురదలో కూరుకుపోయాయి. ముండకై, సురల్ మలై, అట్టమలై, నుల్‌పుజా గ్రామాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జల ప్రళయానికి ఇప్పటికే కేరళ రాష్ట్రం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 330 మంది మరణించారు. మరో 295 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అవిశ్రాంతగా రెస్య్కూ టీం సహాయక చర్యలు చేపడుతుంది. బుదరల్లో కూరుకుపోయిన వారిని వెలికి తీసేందుకు 40 బృందాలతో సెర్చ్ ఆపరరేషన్ నిర్వహిస్తున్నారు. మరోసారి వయనాడ్, కన్నూర్, కాసర్ గఢ్, కోజికోడ్ జిల్లాలకు వర్షాలు పొంచి ఉన్నాయని చెబుతుంది వాతావరణ శాఖ. ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు కురవవచ్చునని ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. కేరళలో జరిగిన పెను విపత్తుకు సాయంగా నిలుస్తుంది సినీ ఇండస్ట్రీ. కేవలం మలయాళ ఇండస్ట్రీనే కాదు.. ఇతర పరిశ్రమలు కూడా సాయం అందిస్తున్నాయి. కమల్ హాసన్, విక్రమ్, విజయ్‌తో సహా పలువురు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మద్దుతు తెలుపుతున్నారు. చియాన్ విక్రమ్ రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాడు. అలాగే వయనాడ్ వరద బాధితులకు తమిళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికతో పాటు హీరో కార్తీ తమ వంతు సాయంగా రూ. 50 లక్షలు ప్రకటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా రూ. 10 లక్షల సాయాన్ని ప్రకటించింది. వీరితో పాటు మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ రూ. 35 లక్షలు ప్రకటించాడు.అలాగే మాలీవుడ్ క్యూట్ కపుల్ పహాద్ ఫజిల్, నజ్రియా కూడా రూ. 25 లక్షలు అందించారు.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మెల్లిగా తన వంతు సాయాన్ని ప్రకటిస్తుంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తన మంచి మనస్సును చాటుకున్నాడు. తన నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్, లక్కీ భాస్కర్ టీం తరుఫున విరాళాన్ని ప్రకటించాడు. కేరళ ప్రభుత్వ విపత్తు సహాయ నిధికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపింది సితార ఎంటర్ టైన్‌మెంట్. లక్కీ భాస్కర్ మూవీ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితారా ఎంటర్ టైన్ మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ మూవీ విడుదల కానుంది. జీవీ ప్రకాష్ బాణీలు అందించాడు.