iDreamPost
android-app
ios-app

ట్రూ లవర్ నటిపై దారుణమైన ట్రోల్స్.. కన్నీటితో స్ట్రాంగ్ రిప్లై!

  • Published Apr 11, 2024 | 3:09 PM Updated Updated Apr 11, 2024 | 3:09 PM

తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవర్ సినిమా తెలుగులో ట్రూలవర్ గా విడుదలైన ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. కాగా, ట్రూలవర్ సినిమా విడుదలైన నుంచి అందులో నటించిన నటికి నెటిజన్స్ తీవ్ర స్థాయిలో దారుణంగా ట్రోల్స్ కు గురి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ దారుణమైన ట్రోల్స్ కు స్పందించిన నటి కన్నీరు పెట్టుకుంటు సమాధానం తెలిపింది.

తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవర్ సినిమా తెలుగులో ట్రూలవర్ గా విడుదలైన ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. కాగా, ట్రూలవర్ సినిమా విడుదలైన నుంచి అందులో నటించిన నటికి నెటిజన్స్ తీవ్ర స్థాయిలో దారుణంగా ట్రోల్స్ కు గురి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ దారుణమైన ట్రోల్స్ కు స్పందించిన నటి కన్నీరు పెట్టుకుంటు సమాధానం తెలిపింది.

  • Published Apr 11, 2024 | 3:09 PMUpdated Apr 11, 2024 | 3:09 PM
ట్రూ లవర్ నటిపై దారుణమైన ట్రోల్స్.. కన్నీటితో స్ట్రాంగ్ రిప్లై!

సాధారణంగా సెలబ్రిటీస్ పై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ అనేవి కొత్తేమీ కాదు. వారు వేసుకున్న బట్టలు నుంచి, చేసే సినిమాల వరకు ప్రతి చిన్న విషయాల్లో ట్రోల్స్ కు గురయ్యేవారు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా.. ఏదైనా ఈవెంట్ ల్లో తారలు నడవిడకను, మాట్లాడే తీరును బట్టి కూడా ఒక్కొక్కసారి విమర్శలను ఎదుర్కొంటారు. అయితే సినిమాలో పాత్రను బట్టి కూడా విమర్శలను ఎదుర్కొన్న వారు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటి కూడా ఒకరు. గుడ్ నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘లవర్’. దర్శకుడు ప్రభ రామ్ వ్యాస్ తెరకెక్కించిన ఈ సినిమా.. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలై భారీ వసూళ్లను సాధించింది. అలాగే తెలుగులో ‘ట్రూ లవర్’ అనే పేరుతో ఫిబ్రవరి 10న థియేటర్లలొ విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఐషు క్యారెక్టర్ లో నటి హరిణి సుందరరాజన్ అలరించిన విషయం తెలిసిందే. అయితే ట్రూ లవర్ లో సినిమాలో నటించిన నుంచి ఈ అమ్మాడు పై నెటిజన్స్ భారీ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ట్రోలింగ్స్ కు స్పందించిన ఈ నటి నెటిజన్స్ కు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘ట్రూలవర్’ సినిమా విడుదలైన నుంచి నటి హరిణి సుందరరాజన్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే హరిణి ఆ సినిమాలో నటించిన పాత్ర వల్లే ఈ ట్రోలింగ్స్ గురవ్వడం గమన్హారం. అయితే తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీ మండిపడింది. అలాగే తనదైన స్టైల్ నెటిజన్స్ కు సమాధానం కూడా తెలిపింది. ఇక సోషల్ మీడియాలో హరిణి పెట్టిన పోస్ట్ లో.. మీరు నాపై కోపం ప్రదర్శించడం కరెక్ట్‌ కాదు. సినిమాలో నా పాత్ర నచ్చకపోతే ఒక నటి పట్ల అలా నీచంగా, అగౌరవంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని ట్వీట్ చేసింది. అలాగే ఇకనైనా ఇలాంటి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ నెటిజన్స్ కు కోరింది. ప్రస్తుతం హరిణి చేసిన ట్వీట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు లవర్ సినిమాలో హరిణిని నెటిజన్స్ ఎందుకు ద్వేషిస్తున్నరంటే.. లవర్ చిత్రంలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ప్రేమించుకుంటారు. అయితే ఈ సినిమాలో అరుణ్ పై అభద్రతా భావంతో దివ్య తన మాటాలతో..దుర్భాషలాడుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే.. అరుణ్ కు, దివ్య బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అదే సమయంలో దివ్యకి తన స్నేహితురాలైన ఐషూ కూడా అతనితో బంధానికి ముగింపు చెప్పమని సలహా ఇస్తుంది. దీంతో ఈ సినిమాలో హరిణి (ఐషూ) నెటిజన్ల దృష్టిలో ఒక చెడ్డ స్నేహితురాలిగా కనిపించింది. పైగా చక్కని ప్రేమ జంటకు సమస్యలు సృష్టించారంటూ ఆన్‌లైన్ తెగ ట్రోలింగ్‌కు గురైంది. అయితే ఈ ట్రోలింగ్స్ అనేవి రోజు రోజుకి ఎక్కువ కావడంతో.. హరిణి తాజాగా వీటిపై స్పందించింది. ఇది కేవలం సినిమా ఒక పాత్ర మాత్రమే అని మీకు తెలియదా అంటూ ట్రోలర్స్ కు తనదైన స్టైల్ లో ఫైర్ అయింది. మరి, లవర్ సినిమాలో నటించిన పాత్రకుగాను నటి హర్షిణి పై వస్తున్న ట్రోల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş