iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్‌కు లవ్ ప్రపోజల్.. ఓకే చెప్పిన బ్యూటీ.. ఎవరంటే..?

  • Published Jan 30, 2024 | 11:59 AM Updated Updated Jan 30, 2024 | 12:06 PM

ఇండస్ట్రీలో హీరోయిన్లు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెలలోనే ప్రియుడ్ని పెళ్లాడబోతోంది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ సైతం పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఇండస్ట్రీలో హీరోయిన్లు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెలలోనే ప్రియుడ్ని పెళ్లాడబోతోంది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ సైతం పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

  • Published Jan 30, 2024 | 11:59 AMUpdated Jan 30, 2024 | 12:06 PM
స్టార్ హీరోయిన్‌కు లవ్ ప్రపోజల్.. ఓకే చెప్పిన బ్యూటీ.. ఎవరంటే..?

ఇండియన్ సినిమాల్లో సత్తా చాటిన బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. మద్రాస్ పట్నం మూవీతో కోలీవుడ్ టౌన్‌లో అడుగుపెట్టిన అమీ.. తెలుగులో నేరుగా రామ్ చరణ్ మూవీ ఎవడు మూవీలో నటించింది. ఎక్కువ హిందీ, తమిళ్ సినిమాల్లోనే యాక్ట్ చేసింది. ఐ, రోబో వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి వెల్ నోటెడ్ యాక్ట్రస్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. మళ్లీ మేకప్ వేసుకుంది. అరుణ్ విజయ్- దర్శకుడు ఎల్ విజయ్ కాంబోలో తెరకెక్కించిన మిషన్- చాఫ్టర్ 1లో నటించింది. ఇది ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది.

2018 తర్వాత ఆమె తెరపై కనిపించకపోవడానికి కారణం.. ఓ బిడ్డకు తల్లి అయ్యి..అతడి సంరక్షణ బాధ్యతల్లో తలమునకలు అయ్యింది ఈ విదేశీ భామ. తొలుత అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ఆండ్రీస్ పనయోట్టు అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. 2019లో వీరి ప్రేమ పట్టాలు ఎక్కగా.. అదే ఏడాది సెప్టెంబర్‌లో వీరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ జన్మించాడు. అయితే 2022లో ఈ జంట విడిపోయింది. ఆ సమయంలో అతడితో ఉన్న ఫోటోలన్నీ సోషల్ మీడియా నుండి తొలగించింది అమీ జాక్సన్. ఆ తర్వాత హాలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వెస్ట్ విక్‌తో ప్రేమలో పడింది. సంవత్సరానికి పైగా లవ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతోంది.

 

వెస్ట్ వీక్.. అమీ జాక్సన్‌కు ప్రపోజ్ చేయగా.. ఆమె యాక్సెప్ట్ చేసింది. ఆమె చేతికి ఉంగరం తొడిగాడు ప్రియుడు. ప్రస్తుతం ఈ జంట స్విట్జర్లాండ్ లో చిల్ అవుతోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ బ్యూటీ. ఆమెకు కృతి సనన్ లాంటి బాలీవుడ్ నటీమణులతో సహా పలువురు కంగ్రాట్స్ తెలిపారు. ఇక సుమారు 5-6 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి సినిమాలు స్టార్ చేసింది అమ్మడు. మిషన్ ఛాప్టర్ రిలీజ్ కాగా, క్రాక్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఇందులో విద్యుత్ జమాల్ హీరోగా చేస్తున్నాడు. నేరా ఫతేహీ, జాక్వెన్ ఫెర్నాండేజ్ బ్యూటీస్ తో పాటు అర్జున్ రాం పాల్ నటిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş