iDreamPost
android-app
ios-app

ఆ హీరోతో ప్రేమ, పెళ్లి.. హీరోయిన్‌ వర్ష ఏమన్నారంటే!

  • Published Feb 08, 2024 | 1:08 PM Updated Updated Feb 08, 2024 | 1:08 PM

Varsha Bollamma: స్వాతిముత్యం హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి తెలుగు ప్రేక్షకుల అందరికి తెలిసిందే. అయితే గతకొన్ని రోజులుగా వర్ష ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకుంటుదని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా వర్ష తన పెళ్లి పై క్లారిటీ ఇస్తూ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Varsha Bollamma: స్వాతిముత్యం హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి తెలుగు ప్రేక్షకుల అందరికి తెలిసిందే. అయితే గతకొన్ని రోజులుగా వర్ష ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకుంటుదని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా వర్ష తన పెళ్లి పై క్లారిటీ ఇస్తూ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

  • Published Feb 08, 2024 | 1:08 PMUpdated Feb 08, 2024 | 1:08 PM
ఆ హీరోతో ప్రేమ, పెళ్లి.. హీరోయిన్‌ వర్ష ఏమన్నారంటే!

కోలీవుడ్ నటి ‘వర్ష బొల్లమ్మ’. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈమె మొదటగా విజయ్ దళపతి నటించిన ‘విజిల్’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకుగాను ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే కొట్టేసింది వర్ష. ఈ సినిమా తర్వాత వర్షకు వరుసగా తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఈ బ్యూటీ తెలుగులో.. ‘జాను’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’, ‘స్టాండప్ రాహుల్’ లో నటించింది. అలాగే ఇటీవలే ‘స్వాతి ముత్యం’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే.. గత కొన్నిరోజులుగా వర్ష బొల్లమ్మ పై ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీటిపై స్పందించిన వర్ష పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా వర్ష బొల్లమ్మ, హీరో సందీప్ కిషన్ నటిస్తున్నా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ లో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 16న థీయేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే షూరు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ వర్ష పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే.. తారల పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురవుతుండగా.. వాటికి ఎంతో స్పోర్టివ్ గా సమాధానం తెలిపింది. ఈ క్రమంలోనే వర్ష బొల్లమ్మ తన ప్రేమ, పెళ్లి వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఎందుకంటే.. గతంలో వర్ష స్వాతిముత్యం సినిమాలో బెల్లంకొండ గణేష్ తో కలిసి నటించింది. ఆ సమయంలో వర్ష గణేష్ తో ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా, వాటిపై ఇప్పుడు వర్షా ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. అలాగే ‘మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయినా.. కలిసి బయట తిరిగినా ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు. కానీ, మేము ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ, నేను ఏదైనా పోస్ట్ పెడితే అందుకు తాను రియాక్ట్ అవ్వడం.. తన పోస్టులకు నేను రియాక్ట్ కావడం లాంటి పనులు చేస్తే అందులో అర్థం ఉంటుంది. కానీ, మా మధ్య ఇలాంటివి ఏమి జరగకుండానే.. ఆ రూమర్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత దానికి కరెక్ట్ గా రిప్లై కూడా ఇచ్చాను. నిజం చెప్పాలంటే గణేష్ ఒక గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే’. అంటూ చెప్పుకొచ్చింది వర్ష.

ఇక వర్ష నటిస్తున్నా ఊరు పేరు భైరవకోన సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. దీనిని చూసిన ప్రేక్షకులు త్వరలో సందీప్ మంచి హిట్ కొట్టబోతున్నడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, వర్ష బొల్లమ్మ తన వ్యక్తిగత విషయాల పై క్లారిటీ ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetpark girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel