Swetha
ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో అసలు అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు ఊహించని రిజల్ట్స్ ఇస్తున్నాయి. ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిందని కొందరు అంటున్నారు. కానీ నిజానికి
ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో అసలు అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు ఊహించని రిజల్ట్స్ ఇస్తున్నాయి. ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిందని కొందరు అంటున్నారు. కానీ నిజానికి
Swetha
ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో అసలు అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు ఊహించని రిజల్ట్స్ ఇస్తున్నాయి. ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిందని కొందరు అంటున్నారు. కానీ నిజానికి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయడానికి భారీ సెట్అప్ లు.. భారీ క్యాస్టింగ్ లాంటివి అవసరం లేదని కంటెంట్ ఉంటె చాలని చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ విషయంలోనూ అదే జరిగింది.
మార్కెట్ లో బాగా క్రేజ్ ఉన్న రెండు ఫెమిలియర్ ఫేసెస్ తో ఫేస్ ఆఫ్ కు దిగాడు సోషల్ మీడియ హీరో మౌళి. పైగా అటు సినిమాలోనూ ఎలాంటి భారీ తారాగణం లేదు. అయినా సరే టికెట్ వర్త్ అనిపించేవిధంగా క్రౌడ్ పుల్లింగ్ చేస్తుంది లిటిల్ హార్ట్స్. కేవలం కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఓటిటి గా తీసిన సినిమాను థియేటర్స్ లో వేశారు. ఆ నమ్మకాలూ ఎక్కడా కూడా దారి తప్పలేదు. కేవలం మూడు రోజుల్లో పన్నెండు కోట్ల గ్రాస్ వసూళ్లు చేయడం అంతా ఈజీ కాదు. పైగా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఈ మధ్య ఏ స్టార్ హీరో సినిమాకు కూడా జరగలేదు.
మరి దీని సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే.. అసలు ఎలాంటి సీక్రెట్స్ లేవంట. ప్రేక్షకుల మైండ్సెట్ కు తగినట్టు కథను బిల్డ్ చేసుకుని వారిని ఇంప్రెస్స్ చేయడమే అసలు కనికట్టు. ఎంతసేపని యాక్షన్ , మాస్ వైలెన్స్ సినిమాలు చూస్తారు. ఇంటిల్లిపాది వెళ్లి కాసేపు సరదాగా నవ్వుకుని వద్దామని వారికి కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు దించితే కలెక్షన్స్ ఆటోమాటిక్ గా వస్తాయి.
ప్రస్తుతానికి లిటిల్ హార్ట్స్ టీం లాభాల్లోనే ఉన్నారు. వీక్ డేస్ లో కూడా ఆక్యుపెన్సీ దక్కించుకుంటే ఇక వచ్చేవన్నీ బోనస్ లే. ఎంత రాబట్టాలన్న ఇంకొక మూడు రోజులు మాత్రమే.. ఎందుకంటే కిష్కిందపురి , మిరాయ్ సినిమాలు రేస్ లో ఎంట్రీ ఇస్తాయి. ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు ఎంతలేదన్న పాతిక కోట్ల గ్రాస్ ను అందుకోవచ్చని టాక్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.