Krishna Kowshik
Legend Saravanan: ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ మరో మూవీని లైన్లో పెట్టాడు. ఇటీవల కొత్త మేకోవర్ లో దర్శనమిచ్చి.. అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాాగా ఆయన న్యూ మూవీ ప్రారంభమైంది. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ మెరవనుంది.
Legend Saravanan: ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ మరో మూవీని లైన్లో పెట్టాడు. ఇటీవల కొత్త మేకోవర్ లో దర్శనమిచ్చి.. అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాాగా ఆయన న్యూ మూవీ ప్రారంభమైంది. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ మెరవనుంది.
Krishna Kowshik
ది లెజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. వ్యాపార రంగంలో తిరుగులేని బిజినెస్ మ్యాన్‌గా కొనసాగుతున్నా.. సినిమాలంటే పిచ్చి, నటన అంటే ఫ్యాషన్‌తో లేటు వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 51 ఏళ్ల వయస్సులో హీరోగా మారి.. లెజెండ్ అనే మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం నిర్మాతగానూ మారి.. భారీగా ఖర్చు పెట్టాడు. ఊర్వశి రౌతేలా, గీతికా తివారి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై మిశ్రమ టాక్ తెచ్చుకుంది. ఇదే సమయంలో ఆయన లుక్స్‌పై పలువురు కామెంట్స్ చేయడంతో పాజిటివ్‌గా తీసుకుని సీరియస్‌గా మేకోవర్ దృష్టి పెట్టాడు. ట్రోలర్లకే దిమ్మతిరిగేలా ఆసమ్ లుక్స్‌లో దర్శనమిచ్చాడు శరవణన్. ఇదే సమయంలో తన సెకండ్ మూవీని కూడా ఎనౌన్స్ చేశాడు. ఈ ఎనౌన్స్ మెంట్ వచ్చి మూడు నెలలు అయిపోతున్నా.. ఎటువంటి అప్ డేట్ లేదు.
తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయ్యింది. సూరి హీరోగా వచ్చిన గరుడన్ మూవీతో హిట్ అందుకున్న ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు శరవణన్. తూత్తుకుడిలో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, ఆండ్రియా నటిస్తున్నారు. వీరితో పాటు శ్యామ్, సంతోష్ ప్రతాప్, కాలకేయ ప్రభాకర్ కీ రోల్స్ చేస్తున్నారు. వెంకటేశ్ ఎస్ సినిమాటోగ్రాఫర్ కాగా మహేష్ మాథ్యూ స్టంట్ మాస్టర్‌గా వ్యవమరిస్తున్నాడు. పేరు పెట్టని ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫక్తు యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
తండ్రి వారసత్వాన్ని తీసుకుని.. వ్యాపార రంగంలో అడుగుపెట్టిన శరవణన్.. తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకున్నాడు. ది లెజెండ్ శరవణ పేరుతో కొత్త స్టోర్స్ మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. కోట్లు కుమర్మించి స్టోర్లకు, ప్రొడక్టులకు యాడ్స్ చేయించుకునే అవకాశం ఉన్నా.. నటనపై ఇంట్రస్టుతో కొంత మంది హీరోయిన్లతో కలిసి యాడ్స్ చేసేవాడు. అదే ఇండస్ట్ర్ సినిమాల్లో అడుగుపెట్టేలా చేసింది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని బలంగా నమ్మిన అతడు.. లేటుగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. లెజెండ్ తీశాడు. ఈ సినిమా ఫలితమెలా ఉన్నా.. ఈ వయస్సులో సినిమాలు అవసరమా అన్నారు కొందరు. హీరో ఇలా ఉన్నాడేంటీ అంటూ ట్రోల్స్ చేశారు. కానీ అవేమీ పట్టించుకోకుండా సినిమాలపైనే దృష్టిపెట్టాడు. మేకోవర్ అయ్యి న్యూ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సారి బాక్సాఫీసు మీద దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడు. తాను ఆశించినట్లే ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని మనమూ ఆశిద్దాం.. ఏమంటారు..?